PM Kisan Yojana: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది పీఎమ్ కిసాన్ యోజన నిధులు!
ABN , Publish Date - Dec 31 , 2025 | 02:03 PM
రైతులకు గుడ్ న్యూ్స్. వచ్చే ఏడాది పీఎమ్ కిసాన్ యోజన పథకం నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టాక నిధుల విడుదలకు మార్గం సుగమం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: యావత్ దేశ ప్రజల కడుపు నింపే రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనదని పీఎం కిసాన్ యోజన. ఈ పథకంలో భాగంగా ఏటా రైతులకు కేంద్రం ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఏటా మూడు ఇన్‌స్టాల్‌మెంట్‌లలో రూ.6 వేలను చెల్లిస్తోంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల బ్యాంక్ అకౌంట్స్‌లో రూ.2 వేల చొప్పున జమ అవుతున్నాయి. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం 21 ఇన్‌స్టాల్‌మెంట్‌లల్లో నిధులను విడుదల చేసింది (PM Kisan Yojana)
ఇక కొత్త సంవత్సరంలోకి కాలుపెడుతున్న తరుణంలో కేంద్రం 22వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందా అని రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్రం ఈ నిధులను విడుదల చేస్తోంది. 21 ఇన్‌స్టాల్‌మెంట్ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ కోయంబత్తూర్ నుంచి విడుదల చేశారు. ఇప్పటివరకూ నిధుల విడుదల అంతా క్రమం తప్పకుండా సాగింది. దీంతో, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కిసాన్ యోజన నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత నిధుల విడుదలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది.
ఇక రైతులు తదుపరి నిధుల విడుదల వివరాలను తెలుసుకునేందుకు pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. వెబ్‌సైట్‌లో ముందుగా లబ్ధిదారులు నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఈ తరువాత రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఈ క్రమంలో కాప్చా కోడ్‌ను కూడా ఎంటర్ చేస్తే నిధుల విడుదలకు సంబంధించిన స్టేటస్ తెలుస్తుంది.
ఇవీ చదవండి
ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! జపాన్‌ను వెనక్కు నెట్టి..
వెబ్‌సైట్ ఒరిజినలా? లేక ఫేకా? ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే..