Share News

NCCRP: వెబ్‌సైట్ ఒరిజినలా? లేక ఫేకా? ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే..

ABN , Publish Date - Dec 29 , 2025 | 09:46 AM

ఆన్‌లైన్ మోసాల బారిన పడటానికి అవగాహన లేమియే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. మనం సందర్శించే వెబ్‌సైట్ నకిలీనో లేక ఒరిజినలో తెలుసుకోగలిగితే అధిక శాతం మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు. మరి ఇందుకోసం ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

NCCRP: వెబ్‌సైట్ ఒరిజినలా? లేక ఫేకా? ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే..
NCCRP portal guide

ఇంటర్నెట్ డెస్క్: నేటి డిజిటల్ జమానాలో పనులన్నీ మొబైల్ ఫోన్ ద్వారా చక్కపెట్టేసే అవకాశం ఉంది. బ్యా్ంకింగ్, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా ఏదైనా మొబైల్ ఫోన్స్, లాప్‌టాప్‌లతో తెలుసుకోవచ్చు. అయితే, ఫేక్ యాప్స్, వెబ్‌సైట్స్ విషయంలో యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ఫేక్ వెబ్‌సైట్స్‌ అచ్చు ఒరిజినల్‌లా కనిపిస్తూ జనాలను బోల్తా కొట్టిస్తుంటాయి. ఈ ఉచ్చులో పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే (Websites, Apps Authenticity Verification)..

నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCCRP) ద్వారా ఓ వెబ్‌సైట్ ఒరిజినలా లేకా ఫేకా అనే విషయాన్ని ఇట్టే తెలుసుకోవచ్చు. కానీ ఈ పోర్టల్‌ గురించి చాలా మందికి తెలియక ఆన్‌లైన్ మోసాల బారిన పడుతున్నారు.


  • ముందుగా మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌ ద్వారా NCCRP అని గూగుల్‌లో సెర్చ్ చేయాలి.

  • ఆ తరువాత అధికారిక నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌పై క్లిక్ చేయాలి.

  • వెబ్‌సైట్‌లోని ఓ కార్నర్‌లో కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేస్తే పూర్తిస్థాయి మెన్యూ అందుబాటులోకి వస్తుంది.

  • ఈ మెన్యూ లోని రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తరువాత చెక్‌ సస్పెక్ట్ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి.

  • ఇలా సెలక్ట్ చేశాక మనకు వెబ్‌సైట్ యూఆర్ఎల్, యాప్ యూఆర్‌ఎల్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు కావాల్సినది ఎంచుకోవాలి.

  • ఆ తరువాత ఫిల్ ఇన్ బాక్స్‌లో అనుమానాస్పద లింక్‌‌ను కాపీ పేస్టు చేసి కాప్చా సమాచారం ఎంటర్ చేశాక సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి. దీంతో, అనుమానాస్పదన యాప్, లేదా వెబ్‌సైట్ జాతకం మొత్తం బయటపడిపోతుంది.

నెట్టింట కనిపించిన వెబ్‌సైట్స్‌పై క్లిక్ చేయడం లేదా యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఒకసారి ఇలా నిర్ధారించుకుంటే ఆన్‌లైన్ మోసాల నుంచి పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


ఇవీ చదవండి:

ఇది ఏఐ నామ సంవత్సరం.. ఆశ్చర్యం కలిగించే మార్పులు

బంగారం కొనుగోళ్లు.. డిజిటల్ గోల్డ్‌కు జైకొట్టిన జెన్ జీ

Updated Date - Dec 29 , 2025 | 11:21 AM