Share News

Funny wedding moment: వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..

ABN , Publish Date - Dec 31 , 2025 | 08:19 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వెడ్డింగ్ వీడియోలు నెట్టింట హల్‌చల్ చేశాయి.

Funny wedding moment: వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..
wedding vows viral video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వెడ్డింగ్ వీడియోలు నెట్టింట హల్‌చల్ చేశాయి. తాజాగా మరో పెళ్లి వీడియో నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది (priest laughing wedding).


chaudhary kanishka అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పెళ్లి జరుగుతోంది. వధువు ఎరుపు రంగు లెహంగా ధరించి, వరుడితో కలిసి అగ్నిగుండం చుట్టూ ఏడు అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది. అయితే, భారీ లెహంగాతో ఆమె సరిగ్గా నడవలేకపోతోంది. దీంతో ఆమె ముగ్గురు స్నేహితులు వెంటనే ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి వధువు లెహంగాను పట్టుకుని నడవడం ప్రారంభించారు. వధువుతో పాటు ఆమె స్నేహితులు కూడా ఏడడుగులు వేశారు (bride friends vows).


పురోహితుడు వెంటనే వారిని ఆపి.. 'వద్దు.. వద్దు.. మీరు కలిసి నడవకండి (funny marriage vows). మిమ్మల్ని కూడా వివాహితలుగా పరిగణిస్తారు' అని చెప్పాడు. దీంతో అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత వధువు తన స్నేహితులకు పరిస్థితిని వివరించింది. దీంతో వారు మండపం నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 60 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు రెండు లక్షల మంది లైక్ చేశారు. తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు సలాం చెప్పాల్సిందే.. పెళ్లి వేదిక దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే..

మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో నాలుగో పిల్లిని 7 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Dec 31 , 2025 | 08:19 PM