YSRCP To TDP: సొంత ఇలాకా పులివెందులలో జగన్‌కు భారీ షాక్..
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:26 PM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది పార్టీని వీడగా.. తాజాగా జగన్ సొంత ఇలాకాలో కీలక నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పారు.
కడప, డిసెంబర్ 17: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత అనేక మంది వైసీపీ శ్రేణులు పార్టీకి రాజీనామా చేశారు. మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. పలు నియోజవర్గాల్లో వైసీపీకి చెందిన కీలక వ్యక్తులు కూడా ఆ పార్టీని వీడటం జగన్‌కు గట్టి దెబ్బే అని చెప్పుకోవాలి. ఇప్పుడు సొంత ఇలాకా పులివెందులలో కూడా జగన్‌కు ఆ పార్టీ శ్రేణులు బిగ్ షాక్ ఇచ్చారు. జగన్ రాజకీయ కంచుకోట పులివెందులను టీడీపీ బద్దలు కొడుతోంది. జగన్ అనచురుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇటీవల కాలంలో పులివెందుల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో వైసీపీ నేత, జగన్ రెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిల్ మాంగే టీడీపీలో చేరారు. వందలాది మంది వైసీపీ కార్యకర్తలతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో జగన్ అనుచరులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వేంపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నేతలకు బీటెక్ రవి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పొలెట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి, ఇతర టీడీపీ నేతలు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కీలక సూచనలు
అవి ప్రభుత్వ కాలేజీలే.. మెడికల్ కళాశాలలపై సీఎం చంద్రబాబు స్పష్టత
Read Latest AP News And Telugu News