Ananthapur News: టీడీపీ కార్యాలయంలో ‘కొత్త’ సందడి..
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:00 PM
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ‘కొత్త’ సందడి నెలకొంది. పార్టీ జిల్లా నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ సందర్భంగా కార్యకర్తలు పెద్దఎత్తున విచ్చేశారు. దీంతో కార్యకర్తలు, నాయకులతో కార్యాలయం కిక్కిరిసిపోయింది.
- బాధ్యతలు తీసుకున్న జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు
- పార్టీ నేతల అభినందనలు
అనంతపురం: తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో కొత్త సందడి నెలకొంది. పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు(Pula Nagaraju), ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, ఇతర కమిటీ నాయకులు రాంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం తొలిసారి అడుగుపెట్టారు. కొత్త జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, పూర్వపు అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ నుంచీ బాధ్యతలు స్వీకరించారు. తొలుత పూజలు చేసి, తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పూల నాగరాజు, శ్రీధర్ చౌదరికి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, శ్రేణులు బొకేలు, శాలువాలతో అభినందనలు తెలిపారు.

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, టీడీపీ రాష్ట మీడియా కోఆర్డినేటర్ బీవీ వెంకటరాముడు కొత్త సారధులకు అభినందనలు తెలిపారు. పూల నాగరాజు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. అందుకు స్థలం కేటాయించాలన్న కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపుతున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై తొలి సంతకం చేసినట్లు కొత్త అధ్యక్షుడు వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News