Nellore politics: టీడీపీలోకి వైసీపీ కీలక నేత.. జగన్‌కు షాక్
ABN , Publish Date - Dec 13 , 2025 | 04:01 PM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత బిగ్ షాక్ ఇచ్చారు. కార్పొరేటర్ కరీముల్లా వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు.
నెల్లూరు, డిసెంబర్ 13: జిల్లాలో వైసీపీకి (YCP) బిగ్ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. 42 వార్డు వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు. మంత్రి నారాయణ సమక్షంలో కరీముల్లా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరికతో మాజీ మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పరువు పోగొట్టుకున్నారు. కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో మాజీ సీఎం జగన్ పరువుకు భంగం వాటిల్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది.
ఈరోజు (శనివారం) ఉదయం కరీముల్లాను స్వయంగా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ వెంటబెట్టుకుని అమరావతికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విజయవాడలో కరీముల్లాకు మంత్రి నారాయణ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరినీ టీడీపీలోకి తీసుకెళ్లేందుకు ముక్కాల ద్వారకానాధ్ విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
రోజాపై టీడీపీ నగరి నేతల ఫైర్...
కర్నూలులో అతిపెద్ద పరిపాలనా భవనం: మంత్రి ఆనం
Read Latest AP News And Telugu News