Share News

Telugudesham Party: టీడీపీ అనంతపురం జిల్లా జట్టు నియామకం

ABN , Publish Date - Dec 25 , 2025 | 11:01 AM

తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా కమిటీని నియమించారు. పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం పూర్తవగా.. మిగతా 40 మందితో కమిటీ అధికారిక జాబితాను విడుదల చేశారు. ఈ కమిటీలో అన్ని వర్గాలకు అవకాశం కల్పించామని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

Telugudesham Party: టీడీపీ అనంతపురం జిల్లా జట్టు నియామకం

- 40 మందితో కమిటీ.. అధికారిక జాబితా విడుదల

అనంతపురం: తెలుగుదేశం పార్టీ జిల్లా జట్టు ఏర్పాటైంది. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిగా ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ పూల నాగరాజు(Pula Nagaraju), జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్‌ చౌదరిలను నియమించిన విషయం తెలిసిందే. వారి నేతృత్వంలో 40 మందితో కూడిన పూర్తి స్థాయి జిల్లా కమిటీ జాబితాను ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం బుధవారం విడుదల చేసింది. జిల్లా ఉపాధ్యక్షులుగా 9 మందిని నియమించారు. నియోజకవర్గాల వారిగా వీజీ లాలెప్ప (రాయదుర్గం),


వేలూరు రంగయ్య (తాడిపత్రి), చౌళం మల్లికార్జున (కళ్యాణదుర్గం), గుమ్మనూరు వెంకటేశులు, ఎస్‌. బర్దేవలి (గుంతకల్లు), బండి ఆదినారాయణ (శింగనమల), తూమాటి ప్రసాద్‌, కేబీ మర్రిస్వామి (ఉరవకొండ), బి. కృష్ణకుమార్‌ (అనంతపురం అర్బన్‌) ఉన్నారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా 9 మందికి అవకాశం కల్పించారు. వారిలో నియోజకవర్గాల వారిగా యు. బలరామిరెడ్డి (రాయదుర్గం), కంఠాదేవి (అనంతపురం అర్బన్‌), చింబిలి ప్రసాద్‌నాయుడు, చుక్కలూరు విజయలక్ష్మీ (తాడిపత్రి), ఎన్‌. వెంకటేశ్‌ (ఉరవకొండ), కవిత బొజ్జన్న, జి. రవి (కళ్యాణదుర్గం),


ఎస్‌. ఆనంద్‌గోపాల్‌ (గుంతకల్లు), ఏ. అరుణ (శింగనమల)లు ఉన్నారు. జిల్లా అధికార ప్రతినిధులుగా 9మందికి చోటు కల్పించారు. వారిలో నియోజకవర్గాల వారిగా పసుపులేటి నాగరాజు, ఆనంద్‌(రాయదుర్గం), కేశవరెడ్డి (తాడిపత్రి), హెచ్‌డీ కొళ్లాపురప్ప (కళ్యాణదు ర్గం), ఎం.ఖాజాహుస్సేన్‌ (గుంతకల్లు), కాయల అనిల్‌కుమార్‌ యాదవ్‌ (శింగనమల), కె.బీడీ చిన్నమారయ్య (ఉరవకొండ), వడ్డే సరళ, భూ లక్ష్మీ (అనంతపురం అర్బన్‌)లు ఉన్నారు. జిల్లా కార్యదర్శులుగా 9 మందికి అవకాశం కల్పించారు. వారిలో నియోజకవర్గాల వారిగా..


pandu1.2.jpg

కురుబ ప్రశాంతి (రాయదుర్గం), బి. భూ లక్ష్మీ (తాడిపత్రి), కే. సామిర్‌శాబ్‌, చాకలి ప్రకాష్‌ (కళ్యాణదుర్గం), జీవిత కమనిహల్‌, వేణుగోపాల్‌ (గుంతకల్లు), కోనంకి గంగారామ్‌ (అనంతపురం అర్బన్‌), సింగడి దేవికాదేవి (ఉరవకొండ), చవ్వా కులశేఖర్‌రెడ్డి (శింగనమల)లు ఉన్నారు. జిల్లా కోశాధికారిగా పి. మహబూబ్‌ బాషా (రాయదుర్గం), జిల్లా కార్యాలయం కార్యదర్శిగా మహ్మద్‌ తాజుద్దీన్‌ (అనంతపురం అర్బన్‌), మీడియా కోఆర్డినేటర్‌గా దబ్బర కుమారస్వామి (అనంతపురం అర్బన్‌), సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌గా తాతిరెడ్డి సుదర్శన్‌రెడ్డి (తాడిపత్రి) నియమితులయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎల్‌వీఎం 3 ఎం6కి అనంత్‌ టెక్నాలజీస్‌ పరికరాలు

సబ్బుల్లో నంబర్‌ 1 బ్రాండ్‌గా సంతూర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 25 , 2025 | 11:01 AM