Share News

మహాశివరాత్రికి 618 బస్సుల ఏర్పాటు

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:39 PM

మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం 618 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డీపీటీవో టీ అజిత కుమారి తెలిపారు.

మహాశివరాత్రికి 618 బస్సుల ఏర్పాటు

  • వాటిల్లోనూ మహిళలకు ఉచితం

  • జిల్లా ప్రజా రవాణా అధికారి అజిత కుమారి

నరసరావుపేట(అమరావతి): మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌక ర్యార్ధం 618 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డీపీటీవో టీ అజిత కుమారి తెలిపారు. సోమవారం నరసరావుపేటలోని జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక బస్సుల్లోనూ స్ర్తీ శక్తి పథకం అమలవుతుందని వివరిం చారు. కోటప్పకొండ దిగువ నుంచి పైకి భక్తులను చేరవేసేందుకు 95 బస్సులు ఏర్పాటు చేశామన్నారు.


దీంతో పాటు నరసరావుపేట బస్టాండ్‌ నుంచి 213, చిలకలూరిపేట నుంచి 121, వినుకొండ నుంచి 50, అద్దంకి నుంచి 39, చీరాల నుంచి 50, ఒంగోలు నుంచి 50 బస్సులను సంస్థ ఏర్పాటు చేసిందన్నారు. అలాగే నరసరావుపేట డిపో పరిధిలో 1800 మంది, చిలకలూరిపేట డిపో పరిధిలో 750 మంది ఉద్యోగులు పనిచేస్తారన్నారు. కోటప్పకొండ, చిలకలూరి పేట, నరసరావుపేటలలో మొత్తం ఆరు ప్రత్యేక బస్‌స్టేషన్లు నిర్వహిస్తున్నామన్నారు. కోటప్పకొండ ఎగువకు, దిగువకు రాక పోకలు సాగించే బస్సులోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు చెప్పారు.


nrt1.jfifఈ ఏడాది కోటప్పకొండ నుంచి నరసరావుపేటకు తిరుగు ప్రయాణంలో బస్‌స్టేషన్‌ను పెట్లూరివారిపాలెం రోడ్డు మార్గంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా నరసరావుపేట నుంచి కొండ వరకు రూ. 30లు, కొండ దిగువ నుంచి పైకి రూ. 25లు ఛార్టీలు వసూలు చేస్తామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి.

చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం

ఆధార్‌ సేవల విస్తరణకు చర్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 10 , 2026 | 12:41 PM