Share News

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీకి రావడంపై సస్పెన్స్

ABN , Publish Date - Feb 11 , 2026 | 09:42 AM

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వస్తారా, లేదా.. అనే విషయం చర్చనీయాంశమైంది.

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీకి రావడంపై సస్పెన్స్
MLA Arava Sreedhar

అమరావతి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీకి రావడంపై సస్పెన్స్ నెలకొంది. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగిని హర్ష వీణపై లైంగిక వేధింపు కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో అధిష్ఠానం ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ అసెంబ్లీకి వస్తాడా? లేదా? అనే విషయమై ప్రచారం జోరందుకుంది. అయితే.. మంగళవారం సాయంత్రమే ఆయన విజయవాడకు వచ్చినట్లు సమాచారం.


వీణ, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జనసేన పార్టీ ఈ ఘటనలో నిజానిజాలు తెలుసుకునేందుకు ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే శ్రీధర్.. కమిటీ ముందు హాజరై పూర్తి వివరాలు వెల్లడించారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ కమిటీకి అప్పగించారు. ఈ వ్యవహారంలో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటానని శ్రీధర్ ఇప్పటికే స్పష్టం చేశారు.


Also Read:

ఎడాపెడా దోచేశారు

నెయ్యి ట్యాంకర్ల నుంచి లంచాలు..

For More Latest News

Updated Date - Feb 11 , 2026 | 10:20 AM