Share News

మీ పోలీస్‌... మీ ఫ్రెండ్‌..!

ABN , Publish Date - Feb 11 , 2026 | 04:20 AM

ఏదైనా అన్యాయం జరిగినప్పుడు.. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే కొందరు వెనుకాడుతుంటారు..! జరిగిందేదో జరిగిపోయింది... అనే భావనతో బాధను దిగమింగుకుని మిన్నకుండిపోతారు.

మీ పోలీస్‌... మీ ఫ్రెండ్‌..!

  • కియో్‌స్కల ద్వారా పోలీస్‌ సేవలు ప్రజలకు చేరువ

  • పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదుకు అవకాశం

  • విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్త ప్రయోగం

  • రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు

  • ఫిర్యాదు చేసినవారికి అక్కడికక్కడే రశీదు జారీ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఏదైనా అన్యాయం జరిగినప్పుడు.. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే కొందరు వెనుకాడుతుంటారు..! జరిగిందేదో జరిగిపోయింది... అనే భావనతో బాధను దిగమింగుకుని మిన్నకుండిపోతారు. ముఖ్యంగా మహిళలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి భయపడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా విశాఖ నగర కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ ‘మీ పోలీస్‌... మీ ఫ్రెండ్‌’ పేరిట కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాంటివారి కోసం కియా్‌స్కలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. బాధితులు కియోస్క్‌ వద్ద తమ సమస్య చెబితే ఆటోమేటిక్‌గా ఫిర్యాదును స్వీకరించి సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు చేరవేస్తుంది. దానికి సంబంధించిన రశీదును కూడా జారీచేస్తుంది.

స్టేషన్‌ వరకూ రాని కేసులు ఎన్నో..

విశాఖ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏటా దాదాపు 10 వేల కేసులు నమోదవుతుంటాయి. అనేక రకాల కారణాలతో స్టేషన్‌ వరకూ రాకుండా ఆగిపోయే కేసులు కూడా అంతే సంఖ్యలో ఉంటాయని అంచనా..! కొంతమంది విద్యార్థులు, మహిళలు తమకు అన్యాయం జరిగినా...పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడతారు. ఆర్థికంగా సంపన్నులు, సమాజంలో పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలు కూడా ఫిర్యాదు చేసేందుకు మందుకురారు. దీన్ని ఆసరాగా తీసుకుని పోకిరీలు, దొంగలు, మోసగాళ్లు పెచ్చుమీరిపోతున్నారు. ఈ నేపథ్యంలో కియో్‌స్కలను అందుబాటులోకి తీసుకొస్తే.. స్టేషన్‌ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండానే పోలీస్‌ సేవలను ప్రజలకు చేరువచేసే అవకాశం ఉంటుందని పోలీస్‌ కమిషనర్‌ గుర్తించారు. నగరంలో ఎక్కువగా మహిళలపై వేధింపులు, చోరీలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ కియో్‌స్కలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కియో్‌స్కలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలను అర్థం చేసుకునే సదుపాయం ఉంటుంది. ఒకవేళ ఫిర్యాదును కాగితంపై రాసి కియోస్క్‌ వద్ద ఉన్న స్కానర్‌లో పెడితే స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో పోలీస్‌ స్టేషన్‌కు చేరవేసేస్తుంది. ఈ తరహా కియో్‌స్కలను రైల్వేస్టేషన్‌, ద్వారకా బస్‌స్టేషన్‌, రద్దీగా ఉండే ఇతర బజార్లు, విద్యాసంస్థల వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి ‘మీ పోలీస్‌... మీ ఫ్రెండ్‌’ అని నామకరణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులకు ఇప్పటికే దీనిపై సమగ్ర సమాచారం అందజేశారు. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే కియో్‌స్కలను అందుబాటులోకి తేవాలని సీపీ భావిస్తున్నారు. కియోస్క్‌ ఏర్పాటైతే దేశంలోనే ఈ తరహా ఫిర్యాదులు స్వీకరిస్తున్న మొదటి నగరంగా విశాఖకు గుర్తింపు లభిస్తుందని సీపీ బాగ్చి వివరించారు.

Updated Date - Feb 11 , 2026 | 04:20 AM