నిజమైన సీరియల్ త్వరలో చూస్తారు: పొంగులేటి శ్రీనివాస్
ABN , Publish Date - Jan 24 , 2026 | 08:15 PM
సిట్ విచారణ పూర్తిగా చట్టప్రకారమే జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అవసరమైతే కేసీఆర్‌కు సైతం నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జనవరి 24: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను సిట్ విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్ చాట్‌లో స్పందించారు. కేటీఆర్‌ను ఉరి తీస్తామని తాము ఎప్పుడైనా అన్నామా? అని ప్రశ్నించిన ఆయన.. ఎందుకు ఉలిక్కి పడుతున్నారన్నారు. చేసిన తప్పులను ప్రజల ముందు పెడుతున్నామని చెప్పారు.
కేటీఆర్ ఉపయోగిస్తున్న భాషను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలకు నిజం తెలిసే రోజు త్వరలోనే వస్తుందని పొంగులేటి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది ట్రైలర్ మాత్రమేనని.. అసలు సీరియల్ త్వరలోనే మొదలవుతుందని చెప్పారు. ఆ సీరియల్‌లో సీరియస్ ఎపిసోడ్‌లు కూడా రాబోతున్నాయని వ్యాఖ్యానించారు.
దావోస్ పర్యటనపై వచ్చిన విమర్శలకు కూడా మంత్రి పొంగులేటి సమాధానం ఇచ్చారు. దావోస్‌కు తన కుమారుడు బిజినెస్‌మ్యాన్‌గా వెళ్లారని, ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాలకు, ఆయనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా స్వతంత్రంగా దావోస్‌కు వెళ్లారని.. ప్రభుత్వ సొమ్ముతో ఆయన వెళ్లలేదన్నారు చెప్పుకొచ్చారు.
సిట్ విచారణపై పొంగులేటి మాట్లాడుతూ.. ఇది ఎలాంటి రాజకీయ ప్రతీకార చర్య కాదని, పూర్తిగా చట్టప్రకారం సాగుతోందని చెప్పారు. అవసరమైతే కేసీఆర్‌కు కూడా నోటీసులు జారీ చేస్తామని, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చట్ట పరిధిలోనే విచారణ జరుగుతుందని ఆయన వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నాంపల్లి ఫర్నీచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి
Read Latest Telangana News And Telugu News