ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి
ABN , Publish Date - Jan 24 , 2026 | 02:36 PM
ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులను కఠినంగా శిక్షపడేలా చూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమని.. రాజకీయ కక్ష్య అని అనడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి24 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) దోషులను కఠినంగా శిక్షపడేలా చూస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు(Telangana Minister Jupally Krishna Rao) తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమని.. దానిని రాజకీయ కక్ష్య అని అనడం సరికాదని ఆయన అన్నారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేశారు. ఫోన్‌ట్యాపింగ్‌లో పాత్రధారులెవరో, సూత్రధారులెవరో తెలియాల్సి ఉందన్న మంత్రి.. దీనిని దిగజారుడు తనమే అంటారని చెప్పుకొచ్చారు. ప్రజాధనంతో నడిచేది విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ అని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా? దర్యాప్తు జరిపించవద్దా.? అని ప్రశ్నించారాయన.
నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం..
ఫోన్‌ట్యాపింగ్ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. ఫోన్.. ట్యాపింగ్ అవుతుందని వి.ప్రకాశ్ అనే వ్యక్తి ఆరోజే చెప్పారని ప్రస్తావించారు. ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ కూడా ఫోన్‌ట్యాపింగ్ అయిందని గతంలో మాట్లాడారని గుర్తుచేశారు. ఐఏఎస్ అధికారులు ఆకునూరి మురళి సైతం ఈ అంశం గురించి మాట్లాడారని చెప్పుకొచ్చారు. మాజీ గవర్నర్ తమిళసై ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని చెప్పారని ప్రస్తావించారు. మాజీ మంత్రి కేటీఆర్ సహా మరి కొందరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యుండొచ్చని ఒప్పుకున్నారని జూపల్లి అన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పాటు చేసుకున్నది ప్రజల సమస్యలు పరిష్కారం కోసమేనని స్పష్టం చేశారు.
కేటీఆర్‌కు 160 సీఆర్పీసీ కింద మాత్రమే నోటీసులు ఇచ్చారని.. నేరస్థులుగా పరిగణించలేదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సాక్షిగా సమాచారం కోసమే పోలీసులు కేటీఆర్‌ను విచారణకు పిలిచారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో పాటు కీలక పాత్ర పోషించిన కోదండరామ్‌నూ గతంలో అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడించారు. చట్టం ప్రకారం నోటీసులిచ్చి పోలీసులు విచారిస్తారని చెప్పారు. SIB చీఫ్ ప్రభాకర్ రావు.. అమెరికాకు ఎందుకు వెళ్లిపోయారని నిలదీశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఇండియాకు వచ్చారని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు రావడానికి చాలా కారణాలున్నాయని చెప్పారు. పార్టీలకు అతీతంగా అందరూ విచారణకు వచ్చారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం
బీఆర్ఎస్ నేతకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు
Read Latest Telangana News And Telugu News