కాళేశ్వరం-మేడారానికి ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Jan 24 , 2026 | 01:58 PM
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం భూపాలపల్లి డిపో పరిధిలో మొత్తం నాలుగు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ హిందు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
మహదేవపూర్(కరీంనగర్): మేడారం మహా జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం భూపాలపల్లి డిపో పరిధిలో మొత్తం నాలుగు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ హిందు తెలిపారు. భూపాలపల్లి(Bhupalpally) పట్టణంలో భూపాలపల్లి బస్‌స్టేషన్, కాటారంలో కాళేశ్వరం వెళ్లే మార్గంలో ఉన్న బస్‌స్టేషన్, కాళేశ్వరం లో కాళేశ్వరం బస్టాండ్, మహారాష్ట్రలోని సిరొంచ బస్‌స్టేషన్ పక్కన ఉన్న పార్కింగ్ ప్రదేశం నుంచి మేడారం అమ్మవారి గద్దెల వరకు మొత్తం 80 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆమె తెలిపారు. భూపాలపల్లి క్యాంపు ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు కొనసాగుతుందని, మిగిలిన కాటారం, కాళేశ్వరం, సిరొంచ క్యాంపులు ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆమె వివరించారు.

చార్జీల వివరాలిలా..
భూపాలపల్లి నుంచి మేడారం వరకు పెద్దలకు రూ.230, పిల్లలకు రూ.140, కాళేశ్వరం నుంచి మేడారం వరకు పెద్దలకు రూ.360, పిల్లలకు రూ.210, సిరొంచ నుంచి మేడారం(Medaram) వరకు పెద్దలకు రూ. 400, పిల్లలకు రూ.230 ఉంటుందని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని భూపాలపల్లి, పరిసర ప్రాంతాల భక్తులు వినియోగించుకోవాలని ఆమె కోరారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని డీఎం సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..
జగన్ శవయాత్ర చేసినా పట్టించుకోరు: మంత్రి సవిత
Read Latest Telangana News and National News