Minister Ponguleti: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై మంత్రి క్లారిటీ
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:04 PM
కేసీఆర్ ప్రభుత్వంలో హాస్టల్ విద్యార్థులకు చాలీచాలని భోజనం పెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపణలు చేశారు. తమ ఇందిరమ్మ ప్రభుత్వంలో మెస్ చార్జీలతో పాటు కాస్మొటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా చేసుకుంటూ పోతున్నామని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా, జనవరి4(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దతండాలో రూ.14 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) వ్యాఖ్యానించారు. ఇవాళ(ఆదివారం) ఖమ్మం రూరల్ ఏదులాపురం మున్సిపాలిటీ టెంపుల్ సిటీ చిన్నతండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. పేదవారికి భద్రత కల్పించాలని అనేక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో హాస్టల్ విద్యార్థులకు చాలీచాలని భోజనం పెట్టిందని ఆరోపణలు చేశారు. తమ ఇందిరమ్మ ప్రభుత్వంలో మెస్ చార్జీలతో పాటు కాస్మొటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా చేసుకుంటూ పోతున్నామని చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా బొమ్మలు చూపించమని చెప్పుకొచ్చారు. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రత్యేక వ్యూహం.... సింఘ్వీతో సీఎం రేవంత్ చర్చలు
బాబోయ్.. టైగర్ మళ్లీ ఎంట్రీ.. భయాందోళనలో ప్రజలు
Read Latest Telangana News And Telugu News