Tiger Alert: బాబోయ్.. టైగర్ మళ్లీ ఎంట్రీ.. భయాందోళనలో ప్రజలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 09:37 AM
మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోంది. పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గంగారం, కొత్తగూడ మండలాల్లో పులి కదలికలు గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
మహబూబాబాద్, జనవరి4(ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లాలోని (Mahabubabad District) అటవీ ప్రాంతాల్లో పెద్దపులి (Tiger) సంచరిస్తోంది. ముఖ్యంగా గంగారం, కొత్తగూడ మండలాల్లో పులి కదలికలు గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే సమీప గ్రామాల్లో పులి నుంచి రక్షణకు అధికారులు ప్రత్యేకంగా భద్రత పెంచారు. పులి నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు. పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ సమీప ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
పులి పాదముద్రలు
గంగారం మండలం దుబ్బగూడెం, జంగాలపల్లి అడవుల్లో పులి పాదముద్రలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు, వన్యప్రాణి సంరక్షణ అధికారులు అటవీ సమీప ప్రాంతాలను పరిశీలించారు. పులి స్థానిక ప్రాంతాల్లో తిరుగుతుందని గుర్తించామని అన్నారు. అలాగే, కొత్తగూడ మండలంలోనూ పులి సంచరించినట్లు స్థానికంగా ప్రచారం జరిగింది. పులి గ్రామంలోకి వస్తే ప్రజల భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
అధికారులు అప్రమత్తత
ఈ క్రమంలో వన్యప్రాణి, పోలీసు అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. పులిని పట్టుకోవడానికి అధికారులు చర్యలు చేపట్టారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత భద్రత కల్పించాలని అధికారులు భావించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో చిన్నపాటి బందోబస్తు, గేట్లు పెట్టి కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు. అడవి ప్రాంతాల దగ్గరగా వెళ్లేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు. ప్రజలు రాత్రిపూట అటవీ దగ్గరకు వెళ్లవద్దని, అటువైపుగా ప్రయాణించవద్దని అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రత్యేక వ్యూహం.... సింఘ్వీతో సీఎం రేవంత్ చర్చలు
అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండ.. అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన భట్టి
Read Latest Telangana News And Telugu News