Share News

జీహెచ్‌ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం.. రూ.11,460 కోట్లతో మెగా బడ్జెట్

ABN , Publish Date - Jan 31 , 2026 | 10:03 AM

జీహెచ్‌ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం శనివారం జరుగనుంది. ఈ సమావేశంలో 11 వేల 460 కోట్ల రూపాయల మెగా బడ్జెట్‌‌కు ఆమోదం తెలుపనున్నారు. మరో 10 రోజుల్లో జీహెచ్‌ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగియనుంది.

జీహెచ్‌ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం.. రూ.11,460 కోట్లతో మెగా బడ్జెట్
GHMC Council Meeting

హైదరాబాద్, జనవరి 31: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పాలక మండలి పదవీ కాలం మరో 10 రోజుల్లో ముగియనుంది. శనివారం ఉదయం 10:30 గంటలకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalaxmi) అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ప్రస్తుత పాలక మండలికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ మెగా బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు.


ఔటర్ రింగ్ రోడ్(ORR) వరకు జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరించిన నేపథ్యంలో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. మొత్తం 11 వేల 460 కోట్ల రూపాయల మెగా బడ్జెట్‌ను ప్రతిపాదించారు. పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో 9 వేల 200 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండగా.. కొత్తగా విలీనమైన 27 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు 2 వేల 260 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 12 జోన్లు, 60 సర్కిల్స్, 300 వార్డులను దృష్టిలో ఉంచుకుని 2026-27 బడ్జెట్ రూపకల్పన చేశారు.


ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలక మండలి పదవీ కాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది. అయితే ఫిబ్రవరి 11 నుంచి జీహెచ్‌ఎంసీని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజిస్తూ తెలంగాణ సర్కార్ ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న చివరి కౌన్సిల్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి...

కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన

మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ జూమ్ మీటింగ్.. చర్చించిన అంశాలివే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 10:29 AM