Share News

మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ జూమ్ మీటింగ్.. చర్చించిన అంశాలివే

ABN , Publish Date - Jan 31 , 2026 | 09:40 AM

మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 90 స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది.

మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ జూమ్ మీటింగ్.. చర్చించిన అంశాలివే
CM Revanth Reddy

హైదరాబాద్, జనవరి 31: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై(Municipal Elections) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అమెరికా నుంచి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్‌‌ఛార్జ్ మీనాక్షి సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల సర్వే నివేదికలను టీపీసీసీ చీఫ్ సీఎంకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని రేవంత్ రెడ్డి టార్గెట్‌ నిర్దేశించారు. రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. ఫిబ్రవరి 3 నుంచి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.


తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీకి మినహాయింపునిచ్చారు. మొత్తం 2,996 వార్డులకు పోటీ జరగనుంది. ఈనెల 28 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో(జనవరి 30) ముగిసింది. శనివారం నాడు నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఫిబ్రవరి మూడున నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడనున్నాయి.


ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఫిబ్రవరి 1న హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన వచ్చాక పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించి మున్సిపల్‌ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఆపై ఫిబ్రవరి 3 నుంచి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సీఎం.. పలు జిల్లాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొననున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఏటీఎం వద్ద కాపు కాచి..

కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 11:41 AM