Share News

కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన

ABN , Publish Date - Jan 31 , 2026 | 07:27 AM

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన బిజీబిజీగా సాగుతోంది. రెండో రోజు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన
CM Chandrababu In Kuppam

చిత్తూరు, జనవరి 31: కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన బిజీబిజీగా సాగుతోంది. రెండో రోజు(శనివారం) ఉదయం కడపల్లిలోని తన నివాసంలో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించనున్నారు. అనంతరం ఉదయం 10:00 గంటలకు గుడిపల్లి మండలం బెగ్గిలపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత 11:00 గంటలకు శాంతిపురం మండలం తుమ్మిసి మోడల్ స్కూల్ సమీపంలో 'ఈ-సైకిల్ పంపిణీ-గిన్నిస్ వరల్డ్' కార్యక్రమంలో పాల్గొనున్నారు. తుమ్మిసి వద్ద జరిగే బహిరంగ సభ కార్యక్రమం వేదిక వరకు కిలోమీటర్ మేర ఈ-సైకిల్‌‌పై చంద్రబాబు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ కంపెనీల స్టాళ్లను ఆయన పరిశీలిస్తారు. సాయంత్రం 5:00 గంటలకు తన నివాసానికి చేరుకోనున్నారు సీఎం.


కుప్పం పర్యటన నిమిత్తం.. శుక్రవారమే చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మొత్తం మూడు రోజులపాటు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. అనంతరం.. ఆదివారం సాయంత్రం కుప్పం నుంచి రాజధాని అమరావతికి బయల్దేరనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నెయ్యి అబద్ధం.. కొవ్వు నిజం!

భారతి సిమెంట్స్‌కు చెక్‌!

For More AP News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 09:39 AM