యర్రాజీ జ్యోతికి గ్రూప్ 1 ఉద్యోగం
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:36 AM
ఏషియన్ అథ్లెటిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన.. అర్జున్ అవార్డు గ్రహీత యర్రాజీ జ్యోతికి ప్రభుత్వం ప్రత్యేక ఇన్‌సెంటివ్స్ ప్రకటించింది.
విశాఖలో 500 గజాల ఇంటి స్థలం.. ఉత్తర్వులు జారీ
అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఏషియన్ అథ్లెటిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన.. అర్జున్ అవార్డు గ్రహీత యర్రాజీ జ్యోతికి ప్రభుత్వం ప్రత్యేక ఇన్‌సెంటివ్స్ ప్రకటించింది. క్రీడాపాధికార సంస్థ ఎండీ ఆమెకు గ్రూప్-1 ఉద్యోగంతో పాటు వెయ్యి గజాల స్థలం కేటాయించాలని ప్రతిపాదించగా, ఇప్పటికే ప్రభుత్వం విశాఖపట్నంలో 500 గజాల్లో రెసిడెన్సియల్ ఫ్లాట్ ఇచ్చేందుకు, ఆమె డిగ్రీ పూర్తి అయిన వెంటనే గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ శుక్రవారం ఉత్తర్వు జారీ చేశారు.