విమానయానం.. అవకాశాలు ఘనం
ABN , Publish Date - Jan 31 , 2026 | 10:01 AM
విమానయాన రంగంలో ఎన్నో అవకాశాలున్నాయని, వాటిని వినియోగించుకుంటే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విమానయాన రంగ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఆన్ గ్రౌండ్ స్టాఫ్‌నకు కూడా అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు.
నైపుణ్యముంటేనే ఒడిసిపట్టగలం
వింగ్స్ ఇండియా షోలో సందడి చేసిన విద్యార్థులు
నగరంతో పాటుగా చెన్నై నుంచి విద్యార్థుల రాక
హైదరాబాద్ సిటీ: విమానయాన రంగంలో అపూర్వమైన అవకాశాలున్నాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి కావాల్సింది నైపుణ్యం. ఆ నైపుణ్యం ఉంటే సులభంగా అవకాశాలను దక్కించుకోవచ్చని నిపుణులు, విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ రంగంలో పైలెట్స్, ఎయిర్‌హోస్టెస్(Pilots, air hostesses)లు మాత్రమే కాకుండా.. ఆన్ గ్రౌండ్ స్టాఫ్‌నకు కూడా అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. వింగ్స్ ఇండియా షోకు వచ్చిన పలు ఇనిస్టిట్యూట్‌ల విద్యార్థులను ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించినప్పుడు వారేం చెప్పారంటే...
పైలెట్ ఒక్కడు ఉంటే సరిపోదు..
విమానం నడపాలంటే పైలెట్ ఒక్కడు ఉంటే సరిపోదు. ఆయనకు తగిన రీతిలో ఆన్‌గ్రౌండ్ సిబ్బంది మద్దతు కూడా అవసరం ఉంది. ఆ నిపుణులను తాము తీర్చిదిద్దుతున్నాము. నిజానికి భారతీయ విమానయాన రంగంలో ఇప్పుడు అపూర్వ అవకాశాలున్నాయి, కానీ, నైపుణ్య కొరత కూడా ఉంది. రాబోయే కాలంలో విమానయాన రంగం మరింత విస్తృతం కానుంది కాబట్టి, అవకాశాలు కూడా అలాగే ఉండనున్నాయి.
- ముష్రినా, ఇన్‌స్ట్రక్టర్, ఏఎస్ఈటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చెన్నై
టికెటింగ్ మొదలు ఎన్నో..
ఎయిర్‌హోస్టెస్ అనేది ఓ భాగం మాత్రమే. ఆన్‌గ్రౌండ్ కార్యకలాపాలను తాము పర్యవేక్షణ చేయడానికి శిక్షణ పొందుతున్నాము. టికెటింగ్ మొదలు ఎన్నో అంశాలు ఉన్నాయి. అన్నింటికీ శిక్షణ కావాల్సిందే. తామంతా డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థులమే. ఈ షో చూసిన తరువాత తమ నిర్ణయం తప్పైతే కాదనిపించింది.
- సమీర, శిల్ప, తన్మయి, ఏఎస్ఈటీ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు
అవకాశాలకు కొదువలేదు..
తాము ఈ కోర్సులో చేరి ఆరు నెలలే అయింది. ఇక్కడ కొంతమంది ఎయిర్‌హోస్టె్‌సలతో మాట్లాడిన తరువాత ఈ రంగంలో ఎలా ఉండాలో మరింతగా తెలుసుకునే అవకాశం కలిగింది. అవకాశాలకైతే భయం లేదనిపించింది.
-వైష్ణవి, ఫ్రాంక్‌ఫిన్ ఇనిస్టిట్యూట్
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ధరలు రికార్డు స్థాయిలో డౌన్! నేటి రేట్స్ ఇవీ
Read Latest Telangana News and National News