ముగిసిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ చివరి మీటింగ్.. మెగా బడ్జెట్‌కు ఆమోదం..
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:34 PM
మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది..
హైదరాబాద్, జనవరి 31: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పాలక మండలి పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో శనివారం చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమావేశంలో వివిధ పార్టీల కార్పొరేటర్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసీఆర్ హయాంలో జీహెచ్‌ఎంసీ అప్పుల పాలైందని, అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. అయితే మేయర్ గద్వాల విజయలక్ష్మి నచ్చచెప్పడంతో ఇరు పార్టీల కార్పొరేటర్లు సర్దుమణిగారు. అనంతరం 2026-27 బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది.
బడ్జెట్ వివరాలు:
జీహెచ్‌ఎంసీకి వివిధ మార్గాల్లో వచ్చిన ఆదాయం : రూ.6,441కోట్లు
జీహెచ్‌ఎంసీ ఖర్చు : రూ.4,057 కోట్లు
రెవెన్యూ మిగులు : రూ.2,384 కోట్లు
జీహెచ్‌ఎంసీ రెవెన్యూ గ్రాంట్స్ : రూ.400 కోట్లు
కొత్తగా విలీనమైన మున్సిపాలిటీల కోసం కేటాయింపులు: రూ.2,260 కోట్లు
విలీనమైన 27 మున్సిపాలిటీల నుంచి వచ్చిన రెవెన్యూ : రూ.1,860 కోట్లు
నా బాధ్యత మరువను: మేయర్
మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. ‘ఇది మా చివరి సమావేశం. భావోద్వేగంతో కూడుకున్నది. ప్రతి నిర్ణయం వెనుక మీ బాధ్యత కనిపించింది. ఉద్యోగులు, సిబ్బంది సమర్థవంతంగా పని చేశారు. నగర అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిది. అంతా కలిసికట్టుగా పని చేశారు. ప్రజలకు మెరుగైన సేవల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు లభించాయి. పదవి ముగిసినా నా బాధ్యత మరువను. నగరం మరింతగా అభివృద్ధి చెందేందుకు నా వంతు కృషి చేస్తాను’ అని విజయలక్ష్మి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
కోఠి ఏటీఎం వద్ద కాల్పులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు
ఘోరం.. ప్రియుడి భార్యను చంపేసిన ప్రియురాలు..
Read Latest Telangana News And Telugu News