చెత్త వేసినా, బహిరంగ మూత్ర విసర్జన చేసినా పెనాల్టీ
ABN , Publish Date - Feb 03 , 2026 | 09:04 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోడ్లపై చెత్త వేసినా, బహిరంగ మూత్ర విసర్జన చేసినా పెనాల్టీ విధించాలని నిర్ణయించింది. ఇప్పటికీ నగరంలోని కొన్ని ఏరియాల్లో చెత్తాచెదారంతో నిండిఉన్నాయి. అయితే.. ఇకనుంచి రోడ్లపై చెత్తవేస్తే జరిమానా విధించాలని నిర్ణయించారు.
నగర పరిశుభ్రతకు సహకరించాలని కర్ణన్ విజ్ఞప్తి
నేటి నుంచి మరో దఫా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ సిటీ: రోడ్లపై చెత్త వేసినా, బహిరంగ మూత్ర విసర్జన చేసినా అక్కడికక్కడ జరిమానా వేయనున్నట్టు జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రకటించింది. మరోసారి చేపట్టనున్న పారిశుధ్య ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా నేటి నుంచి దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. మహా నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో అపరిశుభ్రత నెలకొంటోన్న నేపథ్యంలో చెత్త తొలగిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ నిర్ణయించారు. నేడు మొదలయ్యే డ్రైవ్‌లో భాగంగా 300 డివిజన్ల పరిధిలోని కాలనీలు, బస్తీలు, ప్రధాన రహదారుల వెంట చెత్త, నిర్మాణ రంగ, ఇతర వ్యర్థాలు తొలగించనున్నారు.
ఉదయం 6.30 గంటల నుంచి మొదలయ్యే డ్రైవ్‌లో వంతెనలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, డివైడర్లు, సెంట్రల్ మీడియన్లు, చెరువులు, నాలాలు, ఫుట్‌పాత్, పార్కులను శుభ్రపర్చనున్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల వద్ద పేరుకు పోయిన చెత్త తొలగిస్తారు. పౌరులు, పాఠశాలలు, నివాస సంఘాలతో అవగాహన కార్యక్రమాలు, ఈ వేస్ట్ సేకరణ, గ్రీన్ వ్యర్ధాల నిర్వహణ, పునర్వినియోగం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. నగర పరిశుభ్రతలో పౌరుల సహకారం అవసరమని, పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కర్ణన్ విజ్ఞప్తి చేశారు. గత నెలలోనూ భారీ ఎత్తున బల్దియా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది.
ఈ వార్తలు కూడా చదవండి.
దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రైల్వే బడ్జెట్‌లో.. రాష్ట్రానికి 10134 కోట్లు
Read Latest Telangana News and National News