Share News

కొనసాగుతున్న లాభాలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Feb 18 , 2026 | 03:53 PM

దేశీయ సూచీలు వరుస లాభాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాయి. విదేశీ మదుపర్లు కోనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు పాజిటివ్‌గా మారింది. మంగళవారం విదేశీ మదుపర్లు రూ.995 కోట్లు విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అలాగే అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడం కూడా కలిసి వస్తోంది.

కొనసాగుతున్న లాభాలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
Stock Market

దేశీయ సూచీలు వరుస లాభాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాయి. విదేశీ మదుపర్లు కోనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు పాజిటివ్‌గా మారింది. మంగళవారం విదేశీ మదుపర్లు రూ.995 కోట్లు విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అలాగే అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడం కూడా కలిసి వస్తోంది. దీంతో సూచీలు నష్టాల నుంచి తేరుకుని లాభాల బాట పట్టాయి. చివరకు సెనెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (83,450)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత సానుకూల వార్తలు రావడంతో లాభాల్లోకి దూసుకొచ్చింది. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే 600 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు సెన్సెక్స్ 283 పాయింట్ల లాభంతో 83,734 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 93 పాయింట్ల లాభంతో 25,819 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బీఎస్‌ఈ లిమిటెడ్, భారత్ డైనమిక్స్, టాటా స్టీల్, సీజీ పవర్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, అరబిందో ఫార్మా, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, కేపీఐటీ టెక్నాలజీస్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 376 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 301 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.67గా ఉంది.


ఇవి కూడా చదవండి..

ఇమ్రాన్‌ హత్యకు కుట్ర.. మమ్మల్ని మొహ్సిన్ బెదిరిస్తున్నారు.. మాజీ ప్రధాని సోదరీమణుల ఆరోపణలు..


మీ దృష్టికి పరీక్ష.. ఈ పార్క్‌లో ఉన్న పక్షిని 27 సెకెన్లలో గుర్తించండి..

Updated Date - Feb 18 , 2026 | 04:31 PM