Share News

వరుస లాభాలకు బ్రేక్.. దేశీయ సూచీలకు స్వల్ప నష్టాలు..

ABN , Publish Date - Feb 11 , 2026 | 10:01 AM

అమెరికా-బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ట్రేడ్ భారత వస్త్ర రంగానికి సవాలు విసురుతుందనే అంచనాలు కూడా మదుపర్లలో భయాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్‌పై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి.

వరుస లాభాలకు బ్రేక్.. దేశీయ సూచీలకు స్వల్ప నష్టాలు..
Stock Market

వరుసగా లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. మరోవైపు అమెరికా-బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ట్రేడ్ భారత వస్త్ర రంగానికి సవాలు విసురుతుందనే అంచనాలు కూడా మదుపర్లలో భయాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్‌పై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (84,273)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 70 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరో 150 పాయింట్లు పైకి వెళ్లింది. అయితే మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంతో 84,230 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 8 పాయింట్ల లాభంతో 25,927 వద్ద కదలాడుతోంది (stock market news today).


సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజికీ, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ, టాటా స్టీల్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). హెచ్‌సీ‌ఎల్ టెక్నాలజీస్, ట్రెంట్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, లార్సన్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 143 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.53గా ఉంది.


ఇవి కూడా చదవండి..

అమెరికా-బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్.. భారత్‌కు ఇబ్బందేనా..


బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 11 , 2026 | 10:01 AM