Share News

భారీగా నష్టపోతున్న ఐటీ షేర్లు.. తీవ్ర ఒత్తిడిలో దేశీయ సూచీలు..

ABN , Publish Date - Feb 13 , 2026 | 10:24 AM

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఐటీ రంగం తీవ్ర పోటీ ఎదుర్కొంటుందంటూ విడుదలైన రిపోర్ట్ ప్రతికూలంగా మారింది. ఈ రిపోర్ట్‌తో ఐటీ సెక్టార్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఐటీ రంగంలోని హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు ఓవరాల్‌గా స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.

భారీగా నష్టపోతున్న ఐటీ షేర్లు.. తీవ్ర ఒత్తిడిలో దేశీయ సూచీలు..
Stock Market

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఐటీ రంగం తీవ్ర పోటీ ఎదుర్కొంటుందంటూ విడుదలైన రిపోర్ట్ ప్రతికూలంగా మారింది. ఈ రిపోర్ట్‌తో ఐటీ సెక్టార్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఐటీ రంగంలోని హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు ఓవరాల్‌గా స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా భారీ నష్టాల్లో ఉంది (Indian stock market).


గత సెషన్ ముగింపు (83,674)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం దాదాపు 700 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు వెళ్లింది. ఏ దశలోనూ లాభాల్లోకి రాలేదు. ఐటీ సెక్టర్‌ ఒక శాతానికి పైగా నష్టపోయింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 876 పాయింట్ల నష్టంతో 82,798 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 286 పాయింట్ల నష్టంతో 25,520 వద్ద కదలాడుతోంది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీల్లో మ్యాక్స్ ఫైనాన్సియల్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఫోర్జ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ముత్తూట్ ఫైనాన్స్, కేపీఐటీ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టాటా టెక్, హిందోల్కా మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1245 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 339 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.68గా ఉంది.


ఇవి కూడా చదవండి..

బంగ్లాదేశ్‌లో తారిక్ రెహ్మాన్ హవా.. పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకెళ్తున్న బీఎన్‌పీ..


బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 13 , 2026 | 10:37 AM