Share News

‘పవర్‌ మెక్‌’కు రూ. 1,005 కోట్ల విలువైన ఆర్డర్లు

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:28 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ కంపెనీ రూ.1,005 కోట్ల విలువైన రెండు ఆర్డర్లు సంపాదించింది. ఇందులో రూ.515 విలువైన ఆర్డర్‌ ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ థర్మల్‌ ఎనర్జీ...

‘పవర్‌ మెక్‌’కు రూ. 1,005 కోట్ల విలువైన ఆర్డర్లు

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ కంపెనీ రూ.1,005 కోట్ల విలువైన రెండు ఆర్డర్లు సంపాదించింది. ఇందులో రూ.515 విలువైన ఆర్డర్‌ ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ థర్మల్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి, రూ.490 కోట్ల విలువైన మరో ఆర్డర్‌ను మహాన్‌ ఎనర్జీన్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి సంపాదించింది. ఈ రెండు ఆర్డర్లను పవర్‌ మెక్‌ మూడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రాజెక్టులూ ఒక్కోటి 1,600 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న ‘అలా్ట్ర సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ వి ద్యుత్‌ ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన స్టీమ్‌ జెనరేటర్‌, స్టీమ్‌ టర్బైన్‌ జెనరేటర్‌, అనుబంధ పరికరాల ఏర్పాటు, టెస్టింగ్‌, కమిషనింగ్‌ వంటి క్లిష్టమైన సాంకేతిక పనులతో పాటు అవసరమైన నిపుణుల సేవలనూ అందించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 19 , 2026 | 03:28 AM