Share News

హైదరాబాద్‌లో కాసాగ్రాండ్‌ మాండరిన్‌

ABN , Publish Date - Feb 20 , 2026 | 03:11 AM

కాసాగ్రాండ్‌ రియల్టీ సంస్థ హైదరాబాద్‌లో మరో భారీ లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించింది. మియాపూర్‌లో ‘కాసాగ్రాండ్‌ మాండరిన్‌’ పేరుతో...

హైదరాబాద్‌లో  కాసాగ్రాండ్‌ మాండరిన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కాసాగ్రాండ్‌ రియల్టీ సంస్థ హైదరాబాద్‌లో మరో భారీ లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించింది. మియాపూర్‌లో ‘కాసాగ్రాండ్‌ మాండరిన్‌’ పేరుతో 8 ఎకరాల్లో కంపెనీ ఈ ప్రాజెక్టు చేపట్టింది. హైదరాబాద్‌లో తొలిసారిగా విల్లాలను తలపించేలా అపార్ట్‌మెంట్స్‌ను నిర్మించే తొలి ప్రాజెక్టు ఇదేనని కంపెనీ తెలిపింది. మొత్తం ఆరు బ్లాకుల్లో 334 అలా్ట్ర స్పేషియస్‌ త్రీ బెడ్‌రూమ్స్‌, ఫోర్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లను ఈ ప్రాజెక్టులో నిర్మించనున్నారు. ఈ లగ్జరీ రెసిడెన్షియల్‌ వెంచర్‌లో ఒక్కో ఫ్లాటు కనీస ధర రూ.1.25 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం ఎనిమిది ఎకరాల్లో 5.7 ఎకరాలను ఓపెన్‌ స్పేస్‌గా వదిలేసి అక్కడ చక్కటి చెట్లు, పూల మొక్కలు పెంచుతారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 41,000 చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) విస్తీర్ణంలో ఐదు అంతస్తుల క్లబ్‌ హౌస్‌, 5,600 ఎస్‌ఎ్‌ఫటీలో క్లోరిన్‌రహిత స్విమ్మింగ్‌ పూల్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. వీటికి తోడు 70కిపైగా లైఫ్‌స్టైల్‌ సౌకర్యాలు, 25కుపైగా వెల్‌నెస్‌ ఫోకస్డ్‌ విషయాలు కాసాగ్రాండ్‌ మాండరిన్‌ ప్రాజెక్టు ప్రత్యేకతలని పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 20 , 2026 | 03:11 AM