సీ-390 మిలీనియం విమానం కోసం భారత్‌లో ఎంఆర్‌ఓ సెంటర్
ABN , Publish Date - Feb 20 , 2026 | 03:14 AM
సీ-390 మిలీనియం రవాణా విమానాల కోసం మహీంద్రా గ్రూప్ భాగస్వామ్యంలో భారత్‌లో ఎంఆర్‌ఓ (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్) కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు బ్రెజిల్ విమాన తయారీ...
మహీంద్రా-ఎంబ్రాయెర్ భాగస్వామ్యంలో ఏర్పాటు
న్యూఢిల్లీ: సీ-390 మిలీనియం రవాణా విమానాల కోసం మహీంద్రా గ్రూప్ భాగస్వామ్యంలో భారత్‌లో ఎంఆర్‌ఓ (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్) కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయెర్ ప్రకటించింది. మీడియం ట్రాన్స్‌పోర్ట్ విమానాల (ఎంటీఏ) కొనుగోలు చేయాలనుకున్న భారత వైమానిక దళం అందుకోసం సీ-390 మిలీనియం విమానాలను ఎంపిక చేసింది. ఆ విమానాలకు స్థానికంగానే విడిభాగాలు తయారు చేయాలన్న వ్యూహంలో భాగంగా ఈ ఎంఆర్‌ఓ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు ఎంబ్రాయెర్ తెలిపింది. సీ-390 విమానాలు దేశీయంగానే తయారుచేసేందుకు ఎంబ్రాయెర్, మహీంద్రా గత అక్టోబరులో సంతకాలు చేశాయి.
ఏటా 10 హెలీకాప్టర్ల తయారీ లక్ష్యం: ఎయిర్‌బస్
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌తో (టీఏఎ్‌సఎల్) కలిసి కర్ణాటకలోని వేమగల్‌లో ఏర్పాటు చేసిన ఫైనల్ అసెంబ్లీ లైన్ (ఎఫ్‌ఏఎల్)లో 2029 నాటికి ఏటా 10 హెచ్ 125 హెలీకాప్టర్లు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎయిర్‌బస్ హెలీకాప్టర్ల విభాగం సీఈఓ బ్రూనో ఈవెన్ తెలిపారు. భారత మార్కెట్‌పై తాము బుల్లి్‌షగా ఉన్నట్లు బ్రూనో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం