Share News

వైసీపీ ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, దువ్వాడ మధ్య ఆసక్తికర చర్చ

ABN , Publish Date - Feb 18 , 2026 | 09:06 PM

ఏపీ శాసనమండలి లాబీలో వైసీపీ ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. టెక్కలిలో పార్టీకి దువ్వాడనే దిక్కులే అని శివరామిరెడ్డి వ్యాఖ్యానించారు.

 వైసీపీ ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, దువ్వాడ మధ్య ఆసక్తికర చర్చ

అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఏపీ శాసనమండలి లాబీలో వైసీపీ ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి (Sivaramireddy), దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. టెక్కలిలో పార్టీకి దువ్వాడనే దిక్కులే అని శివరామిరెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో దువ్వాడని కాదనే ధైర్యం పార్టీకి లేదులేనని చెప్పుకొచ్చారు. ఈ గ్యాప్ కొద్దిరోజులే.. సంయమనం పాటించాలని దువ్వాడతో శివరామిరెడ్డి అన్నారు. దువ్వాడ వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందనే కొంతకాలం దూరంగా పెట్టారన్నారు.


శాసనమండలి వాయిదా అనంతరం వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేసుకుంటూ వెళ్తున్న సమయంలో దువ్వాడను పలకరించారు శివరామిరెడ్డి. ఈ నిరసనలో పాల్గొనేందుకు కలిసి రావాలంటూ దువ్వాడకు శివరామిరెడ్డి ఆహ్వానం పలికారు. పార్టీ దూరంగా ఉంచిన సమయంలో ఇప్పుడెందుకులేనని బదులిచ్చారు దువ్వాడ. అనంతరం శివరామిరెడ్డితో కలిసి వెళ్లారు దువ్వాడ శ్రీనివాస్.


ఈ వార్తలు కూడా చదవండి...

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 09:07 PM