జగన్‌కు కొత్త బిరుదిచ్చిన సోమిరెడ్డి.!
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:12 PM
ఏపీ అసెంబ్లీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డిని 'మర్చంట్ ఆఫ్ డెత్' అంటూ అభివర్ణించారు.
అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ అసెంబ్లీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై(YS Jagan Mohan Reddy) మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డిని 'మర్చంట్ ఆఫ్ డెత్' అంటూ అభివర్ణించారు. జగన్ మోహన్ రెడ్డికి విధ్వంసం, రాజకీయాలంటే ఇష్టమని ఎద్దేవా చేశారు. డిక్కీలో శవాన్ని వేసుకుని వచ్చిన తన ఎమ్మెల్సీ భుజాన్నే తట్టి జగన్ అభినందిస్తారని దెప్పిపొడిచారు.
తన ర్యాలీలోనే కార్యకర్తలు చనిపోతే కనీసం పరామర్శకు పోరని సోమిరెడ్డి విమర్శించారు. బూతులు తిట్టిన వారిని పరామర్శిస్తారని, ర్యాలీలు చేపడతారని.. ఆ ర్యాలీల్లో ఒకరో ఇద్దరినో చనిపోయేలా చేస్తారని.. అందుకే జగన్‌ను 'మర్చంట్ ఆఫ్ డెత్' అని అంటానని చెప్పారు. శవరాజకీయాలు చేసేందుకే జగన్ రాజకీయ పార్టీని స్థాపించారని విమర్శించారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల తల్లులను, తండ్రులను దూషించిన నేతలను ఆయన కనీసం కట్టడి చేయలేకపోయారని ఫైర్ అయ్యారు. తల్లిదండ్రులను దూషించిన వారిని శిక్షించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలంటే వైసీపీ నేతలకు గౌరవం లేదు.. జగన్ అండ్ కోపై లోకేశ్ ధ్వజం
జగన్ హయాంలో మద్యనిషేధం పేరుతో రేట్లు పెంచారు: మంత్రి కొల్లు రవీంద్ర
Read Latest Telangana News And AP News And Telugu News