ఎన్ని రోజులు జైల్లో పెట్టినా వెనక్కు తగ్గను: అంబటి రాంబాబు
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:17 PM
18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తాను ఉన్నానని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కక్షగట్టి తనను జైల్లో పెట్టారని ఆరోపించారు.
రాజమండ్రి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి లక్కీ డ్రా కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు (Ambati Rambabu) ఊరట లభించింది. గుంటూరు కోర్టు ఇవాళ (బుధవారం) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తాను ఉన్నానని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కక్షగట్టి తనను జైల్లో పెట్టారని ఆరోపించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని.. వెనుకడుగు వేయనని స్పష్టం చేశారు.
ప్రజలకు అన్ని విషయాలు చెబుతా..
తన ఇంటిపై ఏడు గంటలు దాడి జరిగిందని అంబటి రాంబాబు ప్రస్తావించారు. పోలీసులు ఉండగానే తన ఇంటిపై దాడి జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలపై ప్రజలకు అన్ని విషయాలు చెబుతానని అన్నారు. తనపై దాడిని చంద్రబాబు, లోకేశ్ మానిటరింగ్ చేశారని ఆరోపించారు. హోంమంత్రి వంగలపూడి అనిత కానిస్టేబుల్‌ను కూడా బదిలీ చేసే పరిస్థితుల్లో లేరన్నారు. ఎన్ని రోజులు జైల్లో పెట్టినా వెనక్కు తగ్గనని, ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలగొట్టేవరకు పోరాడతానని స్పష్టం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలును ఓ శిక్షణా కేంద్రంగా తీసుకున్నానని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత
మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..
Read Latest Telangana News And AP News And Telugu News