Share News

కారుమూరిపై కేంద్ర మంత్రి భూపతిరాజు తీవ్ర ఆగ్రహం

ABN , Publish Date - Feb 18 , 2026 | 09:27 PM

మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్‌దేనా బాధ్యత.. కారుమూరికి బాధ్యత లేదా అని ప్రశ్నిచారు.

కారుమూరిపై కేంద్ర మంత్రి భూపతిరాజు తీవ్ర ఆగ్రహం
Bhupathiraju Srinivasa Varma

పశ్చిమగోదావరి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై (Karumuri Venkata Nageswara Rao) కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (Bhupathiraju Srinivasa Varma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్‌దేనా బాధ్యత.. కారుమూరికి బాధ్యత లేదా అని ప్రశ్నిచారు. ఆయనకు తన ఊరుతో ఎలాంటి సంబంధం లేదా అని నిలదీశారు. తాను ఏది మాట్లాడినా బాలెన్స్‌గా మాట్లాడుతానని స్పష్టం చేశారు. భీమవరంలో భూపతిరాజు శ్రీనివాసవర్మ ఇవాళ(బుధవారం) పర్యటించి, పలు కార్యక్రమాలకు హాజరయ్యారు.


ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కారుమూరిలాగా తాను పిచ్చిపిచ్చిగా మాట్లాడనని... తన దగ్గర అరుపులు, కేకలు ఉండవని తేల్చిచెప్పారు. ఎవరైనా తన గురించి అనవసరంగా మాట్లాడితే అవతలి వ్యక్తికి దెబ్బ తెలియకుండా, నొప్పి తెలియకుండా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. గోమాతను రక్షించడం అందరి కనీస బాధ్యత అని నొక్కిచెప్పారు. ‌కారుమూరి నియోజకవర్గంలో గోమాతను వధిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారాడ్డి కూడా శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని.. వేరే రకమైన కల్తీ జరిగిందని చెబుతున్నారు కదా అని భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 09:34 PM