Home » Bhupathiraju Srinivasa Varma
గత ఐదేళ్లలో దేశంలో ఒక్క డీఎస్సీని నిర్వహించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమేనని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు.
ప్రధాని మోదీ స్వదేశీ ఉద్యమాన్ని బలంగా తీసుకొచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ నొక్కిచెప్పారు. ప్రజలు కూడా భారతదేశ ఉత్పత్తులనే కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.
తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని.. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేసేలా పీవీఎన్ మాధవ్ చూడాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కోరారు. కింది స్థాయి కార్యకర్తలతో మాట్లాడి..వారి సమస్యలు పరిష్కరించేలా మాధవ్ పని చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సూచించారు.
టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి సమూచిత స్థానాన్ని కలిపిస్తోందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు. ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఏర్పాటులో భాగంగా ఏపీలో ఏర్పాటు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో నిధులు పక్కదారి పట్టాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆరోపించారు. ఏపీకి తీరని నష్టం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అండగా నిలుస్తూ, అమరావతితో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి భారీ నిధులు కేటాయించనుంది. రైల్వే, పోలవరం, విశాఖపట్నం వంటి ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థికసాయం అందిస్తుంది
పార్లమెంట్ భవనం దగ్గరలోని విజయ్ చౌక్ నుంచి ఎయిర్‍పోర్టుకు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఓ వాహనాన్ని తప్పించబోయిన కేంద్రమంత్రి డైవర్ సడెన్ బ్రేక్ వేశాడు.
Srinivas Varma: పీఎసీ చైర్మన్ అంటే కేబినెట్ మంత్రి కంటే కీలకమైన బాధ్యత అని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. కేంద్రంలో కాగ్ ఎలా ఉంటుందో.. అలాగే పీఏసీ చైర్మన్‌కి అన్ని శాఖల మీద రివ్యూ చేసే అవకాశం ఉంటుందని అన్నారు.
Srinivas Varma: మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం భీమవరంలో 2కే వాక్ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.