Share News

Car Accident: ఏపీకి చెందిన కేంద్ర మంత్రి కారుకు ప్రమాదం.. పరిస్థితి ఎలా ఉందంటే..

ABN , Publish Date - Mar 12 , 2025 | 07:16 PM

పార్లమెంట్ భవనం దగ్గరలోని విజయ్ చౌక్ నుంచి ఎయిర్‍పోర్టుకు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఓ వాహనాన్ని తప్పించబోయిన కేంద్రమంత్రి డైవర్ సడెన్ బ్రేక్ వేశాడు.

Car Accident: ఏపీకి చెందిన కేంద్ర మంత్రి కారుకు ప్రమాదం.. పరిస్థితి ఎలా ఉందంటే..
Union Minister Bhupathi Raju Srinivasa Varma

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు ప్రమాదం(Car Accident)లో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (Bhupathi Raju Srinivasa Varma) గాయపడ్డారు. రెండు కార్లు ఢీకొని తృటిలో ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షెడ్యూల్ ప్రకారం కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఇవాళ (బుధవారం) సాయంత్రం విజయవాడ రావాల్సి ఉంది. ఈ మేరకు పార్లమెంట్ భవనం (Parliament Building) దగ్గరలోని విజయ్ చౌక్ నుంచి ఎయిర్‍పోర్టుకు ఆయన కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఓ వాహనాన్ని తప్పించబోయిన కేంద్రమంత్రి డైవర్.. సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఎదురుగా వస్తున్న మరో కారును శ్రీనివాసవర్మ వాహనం ఢీకొట్టింది.


సడెన్ బ్రేక్ వేయడంతో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తల, కాలుకు స్వల్పగాయాలు అయ్యాయి. డ్రైవర్‍కు మాత్రం ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ ప్రమాదంతో కాసేపు ఆందోళనకు గురైన కేంద్రమంత్రి అనంతరం తేరుకుని అదే కారులో విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం 05:30 గంటల సమయానికి విమానం ఎక్కి విజయవాడ బయలుదేరారు. విజయవాడలో గురువారం జరిగే ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పాల్గొననున్నారు. మరోవైపు శ్రీనివాసవర్మకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న బీజేపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Vijaysai Reddy: ముగిసిన విజయసాయిరెడ్డి సీఐడీ విచారణ.. సంచలన విషయాలు వెల్లడి..

journalist Revathi: మహిళా జర్నలిస్టుకు 14 రోజుల రిమాండ్.. సంచలనం రేపుతున్న ఘటన..

Updated Date - Mar 12 , 2025 | 07:19 PM