Home » Karumuri Venkata Nageswara Rao
ఏపీ లిక్కర్ రవాణా స్కాం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం రవాణా కాంట్రాక్టుల్లో అక్రమాలకు సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో భాగంగా హైదరాబాద్‌లో గురువారం పలుప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
వైసీపీ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావును సిట్ అధికారులు శనివారం హైదరాబాద్‌లో విచారించారు. నాలుగు గంటల పాటు కారుమూరిని విచారించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. కారుమూరిని ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు విచారించారు.
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్‌దేనా బాధ్యత.. కారుమూరికి బాధ్యత లేదా అని ప్రశ్నిచారు.
వైఎస్ఆర్‌సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ నేతల్ని కొడతాం, చంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కారుమూరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన అనుచరులు ప్రజల భూములను కొట్టేశారని.. వారి భూమికి రక్షణ లేకుండా చేశారని తణుకు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ (Arimilli RadhaKrishna) సంచలన ఆరోపణలు చేశారు . మంత్రి కారుమూరి కారుకూతలు కుస్తూనే ఉన్నారని.. ఆయనను ఎవరూ పట్టించుకోరని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నోటి దూల కాస్త ఎక్కువ. రైతులంటే చులకన భావంతో ఉంటారు. ఇదివరకు ఓ రైతును ఎర్రి పప్ప అన్నారు. సర్వత్రా విమర్శలు రావడంతో దిగొచ్చారు. తాజాగా మరో రైతుపై నోరు పారేసుకున్నారు.