ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్
ABN , Publish Date - Jul 29 , 2026 | 11:34 AM
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
ఢిల్లీ, జులై 29 (ఆంధ్రజ్యోతి): ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు (Karumuri Nageswara Rao) సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఈ కేసులో కస్టోడియల్ దర్యాప్తు అవసరమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ మద్యం కుంభకోణంలో సుమారు రూ.350 కోట్ల ప్రజాధనం దారి మళ్లినట్లు ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఈ కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. నిందితుడి విచారణ అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. కస్టోడియల్ దర్యాప్తు లేకుండా పూర్తిస్థాయిలో నిజాలను వెలికితీయడం కష్టమని పేర్కొంది. కారుమూరి నాగేశ్వరరావు తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోసం వాదనలు వినిపించినప్పటికీ, సుప్రీంకోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
మా ఇంట్లో రెండు పార్టీలు: భువనేశ్వరి
ఎర్రబస్సూ రాదన్నారు.. ఎయిర్‌బస్సు వచ్చేస్తోంది!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News