ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. కారుమూరి పాత్రపై సిట్ స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - Apr 25 , 2026 | 04:26 PM
వైసీపీ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావును సిట్ అధికారులు శనివారం హైదరాబాద్‌లో విచారించారు. నాలుగు గంటల పాటు కారుమూరిని విచారించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. కారుమూరిని ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు విచారించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావును (Karumuri Venkata NageswaraRao) సిట్ అధికారులు ఈరోజు(శనివారం) హైదరాబాద్‌లో విచారించారు. నాలుగు గంటల పాటు కారుమూరిని విచారించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. కారుమూరిని ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు విచారించారు. మద్యం రవాణా టెండర్ల జారీలో కారుమూరి పాత్రపై సిట్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సిట్ ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని విచారించామని తెలిపారు. ఆయన వయసు 60 సంవత్సరాలు పైనే ఉండటంతో చట్టప్రకారం ఆయన కోరిన చోటే విచారించామని వెల్లడించారు.
కారుమూరి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశాం..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశామని సిట్ ఎస్పీ చెప్పుకొచ్చారు. విచారణకు ఆయన సహకరించారని.. అవసరమైతే మరోసారి విచారిస్తామని తెలిపారు. మద్యం రవాణా, టెండర్లు సబ్ కాంట్రాక్టుల అవకతవకల విషయంలో కారుమూరిపై, ఆయన కుమారుడిపై కేసు నమోదైందని చెప్పారు. మద్యం రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి రూ.200 నుంచి రూ. 250 కోట్ల వరకు గండి కొట్టినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయని అన్నారు. కారుమూరి కుమారుడు సునీల్‌ను సిట్ కార్యాలయంలోనే విచారిస్తామని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం సిట్ ముందు ఆయన కుమారుడు విచారణకు హాజరు కావాలని సూచించారు. అనారోగ్య కారణాలతో సునీల్ సమయం కోరారని.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సిట్ ఎస్పీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో కిల్లర్ పార్టీ దారుణాలకు తెగబడుతోంది.. సీఎం వార్నింగ్
బీటెక్ విద్యార్థులను సైబర్ క్రైమ్‌లోకి ముఠాలు లాగుతున్నాయి: రాయపాటి శైలజ
Read Latest AP News And Telangana News And International News And Telugu News