మీరొక చెత్త రిపోర్టర్.. మీరు నవ్వడం ఎప్పుడూ చూడలేదు.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం..
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:39 AM
సీఎన్‌ఎన్ ఛానల్‌కు చెందిన ఓ మహిళా రిపోర్టర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎన్‌ఎన్ ఛానెల్‌కు చెందిన కైట్లాన్ కొల్లిన్స్ అనే మహిళా జర్నలిస్ట్‌పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎన్‌ఎన్ ఛానల్‌కు చెందిన ఓ మహిళా రిపోర్టర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎన్‌ఎన్ ఛానెల్‌కు చెందిన కైట్లాన్ కొల్లిన్స్ అనే మహిళా జర్నలిస్ట్‌పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నువ్వు ఒక చెత్త రిపోర్టర్'వి అంటూ విమర్శించారు (Trump lashes out reporter).
'నేను గత పదేళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నవ్వడం ఇప్పటివరకు ఒక్కసారి కూడా చూడలేదు. మీలాంటి రిపోర్టర్ల వల్లనే సీఎన్‌ఎన్ రేటింగ్ పడిపోతోంది. మీరు నిజాలు ఎప్పుడూ చెప్పరు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అందుకే మీరు ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో నా పేరుతో పాటు చాలా మంది పేర్లను కుట్రపూరితంగా విడుదల చేశారు. అలాంటి వాటి గురించి కాకుండా దేశం మొత్తం గురించి ఆలోచిస్తే మంచిది' అని ట్రంప్ పేర్కొన్నారు (Trump media clash).
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ ఫైల్స్ కుంభకోణం దర్యాఫ్తునకు సంబంధించిన ఫైల్స్‌ను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది (Trump angry response). ఈ ఫైల్స్‌లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఎలన్ మస్క్, పాప్ స్టర్ మైఖేల్ జాక్సన్‌ల ప్రస్తావన, వారి ఫొటోలు బయటపడ్డాయి. ఆ ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ను దీని గురించే జర్నలిస్ట్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు.. దాడులు తీవ్రతరం చేసిన రష్యా..