ఎంబ్రాయర్ నుంచి రెండు కొత్త విమానాలు
ABN , Publish Date - Jan 23 , 2026 | 02:46 AM
ఈ నెల 28 నుంచి హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2026 పేరుతో జరిగే వైమానిక ప్రదర్శన కోసం విమానాల తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి...
వింగ్స్ ఇండియాలో ప్రదర్శన
న్యూఢిల్లీ: ఈ నెల 28 నుంచి హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2026 పేరుతో జరిగే వైమానిక ప్రదర్శన కోసం విమానాల తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రదర్శనలో ‘ఈ195-ఈ2, ఈ-175’ పేరుతో అభివృద్ధి చేసిన రెండు సరికొత్త వాణిజ్య విమానాలను ప్రదర్శించబోతున్నట్టు బ్రెజిల్ కేంద్రంగా పనిచేసే విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ వెల్లడించింది. ఈ రెండు విమానాల్లో 80 నుంచి 146 మంది వరకు ప్రయాణించవచ్చు. ప్రాంతీయ విమానయాన సంస్థలకు ఈ విమానాలు అత్యంత అనువైనవని కంపెనీ తెలిపింది. అత్యంత ఇంధన సామర్ధ్యంతో పాటు ఈ విమానాలను 50 నుంచి 100 శాతం వరకు హరిత ఇంధనంతోనూ నడపవచ్చని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..
మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..