Share News

సోనీ టీసీఎల్‌ జాయింట్‌ వెంచర్‌

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:02 AM

అంతర్జాతీయ టీవీ, హోమ్‌ ఆడియో ఉత్పత్తుల మార్కెట్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. జపాన్‌ కేంద్రంగా పనిచేసే కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ సంస్థ సోనీ, చైనా కేంద్రంగా...

సోనీ టీసీఎల్‌ జాయింట్‌ వెంచర్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టీవీ, హోమ్‌ ఆడియో ఉత్పత్తుల మార్కెట్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. జపాన్‌ కేంద్రంగా పనిచేసే కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ సంస్థ సోనీ, చైనా కేంద్రంగా ఉన్న టీసీఎల్‌ ఒక జాయింట్‌ వెంచర్‌ (జేవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించి అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు కూడా చేశాయి. ఈ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఈక్విటీలో టీసీఎల్‌ కంపెనీకి 51 శాతం, సోనీకి 49 శాతం వాటా ఉంటుంది. ఈ జేవీ ద్వారా తయారు చేసే టీవీలు, హోమ్‌ ఆడియో పరికరాలను సోనీ, బ్రావియా బ్రాండ్ల పేరుతోనే విక్రయిస్తారు. అయితే ఈ జేవీ పెట్టుబడులకు సంబంధించిన వివరాలను రెండు కంపెనీలు ఇంకా వెల్లడించలేదు. సోనీ బ్రాండ్‌ పేరుతో అంతర్జాతీయంగా అమ్మకాలు పెంచుకునేందుకు టీసీఎల్‌ ఈ జేవీకి సిద్ధమైందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..

మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 23 , 2026 | 03:02 AM