Share News

ఎన్‌బీఎఫ్‌సీల బంగారం రుణాల ఏయూఎంలు రూ.4 లక్షల కోట్లకు..

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:20 AM

బులియన్‌ మార్కెట్లో కొనసాగుతున్న ర్యాలీ బంగారం రుణాలు మంజూరు చేసే నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లకు కలిసి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం...

ఎన్‌బీఎఫ్‌సీల బంగారం రుణాల ఏయూఎంలు రూ.4 లక్షల కోట్లకు..

వచ్చే ఏడాది మార్చి నాటికి చేరే చాన్స్‌ : క్రిసిల్‌

న్యూఢిల్లీ: బులియన్‌ మార్కెట్లో కొనసాగుతున్న ర్యాలీ బంగారం రుణాలు మంజూరు చేసే నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లకు కలిసి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నాటికి ఈ కంపెనీల నిర్వహణలో ఉన్న బంగారం ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.4 లక్షల కోట్లు మించనుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. అంతేకాకుండా ఈ సంస్థలు మంజూరు చేసే రుణాల్లో వార్షిక వృద్ధి రేటు 40 శాతం వరకు ఉంటుందని తెలిపింది. 2022-23, 2024-25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఈ ఎన్‌బీఎ్‌ఫసీలు పసిడి ఏయూఎంలు ఏటా సగటున 27 శాతం చొప్పున పెరిగాయి. ప్రస్తుత పసిడి ధరల పెరుగుదలతో ఇది మరింత పెరగనుందని పేర్కొంది. పేద, మధ్య తరగతి ప్రజల్లో ఎక్కువ మంది స్థానిక వడ్డీ వ్యాపారులకు బదులు సంఘటిత రంగంలోని గోల్డ్‌ లోన్‌ ఎన్‌బీఎ్‌ఫసీలను ఆశ్రయించటం ఇందుకు కలిసి రానుంది. అంతేకాకుండా ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి లోన్‌ టు వాల్యూ (ఎల్‌టీవీ) నిబంధనలు సులభతరం కానుండటంతో ఈ సంస్థలు మరింతగా బంగారం రుణాలు మంజూరు చేసే అవకాశం లభించనుందని క్రిసిల్‌ తెలిపింది.

దిగొచ్చిన పసిడి, వెండి

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయి నుంచి దిగివచ్చాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలకు ఉపశమనం ఏర్పడడంతో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకారానికి దిగడం ఇందుకు దోహదపడినట్టు అఖిల భారత సరాఫా అసోసియేషన్‌ తెలిపింది. దీంతో 99.9% స్వచ్ఛత గల మేలిమి బంగా రం 10 గ్రాముల ధర రూ.2,500 తగ్గి రూ.1,57,200కి దిగివచ్చింది. అలాగే కిలో వెండి ధర రూ.14,300 తగ్గి రూ.3,20,000 వద్ద నిలిచింది.

ఇవి కూడా చదవండి..

అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..

మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 23 , 2026 | 06:49 AM