Share News

గౌతమ్‌ అదానీకి ఎస్‌ఈసీ వ్యక్తిగత సమన్లు

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:57 AM

భారతీయ పారిశ్రామిక దిగ్గజం, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీపై అమెరికా సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజీ కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఉచ్చు బిగిస్తోంది. లంచాల కేసులో...

గౌతమ్‌ అదానీకి ఎస్‌ఈసీ వ్యక్తిగత సమన్లు

వాషింగ్టన్‌: భారతీయ పారిశ్రామిక దిగ్గజం, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీపై అమెరికా సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజీ కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఉచ్చు బిగిస్తోంది. లంచాల కేసులో గౌతమ్‌ అదానీ, అతడి సమీప బంధువు సాగర్‌ అదానీలకు ఈ-మెయిల్‌ ద్వారా వ్యక్తిగతంగా సమన్లు జారీ చేయాలని యోచిస్తోంది. ఇందుకు అనుమతించాలని అమెరికా కోర్టులను కోరింది. విధానపరమైన లోపాల పేరుతో అదానీకి సమన్లు అందించేందుకు భారత ప్రభుత్వం రెండుసార్లు తిరస్కరించడంతో ఎస్‌ఈసీ ఈ దిశగా ఆలోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సౌర విద్యుత్‌ ప్రాజక్టుల కోసం ప్రభుత్వ పెద్దలు, అధికారులకు అదానీ గ్రూప్‌ 25 కోట్ల డాలర్ల ముడుపులు చెల్లించిందని ఎస్‌ఈసీ ఆరోపణ. దీనిపై నమోదైన కేసులు వెల్లడించకుండా అదానీ గ్రూప్‌ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించడంతో ఎస్‌ఈసీ ఈ కేసు నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి..

అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..

మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 23 , 2026 | 02:57 AM