Share News

Sankranti festival: సంక్రాంతి వేళ.. భారీగా బస్‌ చార్జీల పెంపు

ABN , Publish Date - Jan 07 , 2026 | 07:26 AM

సంక్రాంతి పండుగను పురష్కరించుకొని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలొస్తున్నా. మామూలు రోజుల్లో చార్జీల కంటే నాటుగు రెట్లు పెంచేధారు. దీనిపై ప్రయాణికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Sankranti festival: సంక్రాంతి వేళ.. భారీగా బస్‌ చార్జీల పెంపు

- రూట్లు.. 4 రెట్లు..

- ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాల ఇష్టారాజ్యం

- డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్న వైనం

- మూలన పడిన వాహనాలూ రోడ్లపైకి

- అనుమతి, ఫిట్‌నెస్‌ లేకున్నా రాకపోకలు

- పట్టించుకోని రవాణా శాఖ, ట్రాఫిక్‌ అధికారులు

హైదరాబాద్‌ సిటీ: పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లి అయిన వారితో సంతోషంగా గడపాలనుకుంటున్న సిటీజనులకు చుక్కలు కనిపిస్తున్నాయి. టికెట్ల బుకింగ్‌ సమయంలోనే వారి ఆనందం ఆవిరవుతోంది. డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టించి ఇష్టానికి టికెట్ల ధరలు పెంచుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే మూడు, నాలుగు రెట్లు.. కొన్ని ట్రావెల్స్‌ ఐదు రెట్లు అంతకంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నాయి. దీంతో పండుగకు పల్లెటూరి ప్రయాణం ఆర్థిక భారంగా మారుతోంది. రెండు నెలల ముందు రైళ్లలో టికెట్‌ బుకింగ్‌ మొదలు కాగా వారం, పది రోజుల్లోనే పూర్తయ్యాయి. నెలన్నరగా చాలా రైళ్లలో బుకింగ్‌ రిగ్రెట్‌గా చూపుతోంది. దీంతో మెజార్టీ ప్రయాణికులకు బస్సులే దిక్కయ్యాయి. దీంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమాన్యాలు ఇష్టానికి దోచుకుంటున్నాయి.


భారీ డిమాండ్‌..

సంక్రాంతి ఈ నెల 14, 15, 16 తేదీల్లో మూడు రోజులపాటు ఉంది. విద్యార్థులకూ ఈ నెల 10వ తేదీ నుంచి సెలవులు ఉన్నా యి. దీంతో 9వ తేదీన స్వగ్రామాలకు వెళ్లేందుకు మెజార్టీ ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆ వారం రోజులపాటు టికెట్ల ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. సాధారణ రోజుల్లో బస్సు కేటగిరీని బట్టి హైదరాబాద్‌(Hyderabad) నుంచి కాకినాడుకు రూ.800 నుంచి రూ.3,299 వరకు ఉండే టికెట్‌ ధరలు ఇప్పుడు రూ.1,500 నుంచి రూ.7 వేలు, 8 వేలకు చేరుకున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే ఏసీ స్లీపర్‌ కోచ్‌లో టికెట్‌ ధరలు రూ.2,222 నుంచి రూ.5099 వరకు ఉన్నాయి.


city2.3.jpg

నాన్‌ ఏసీ కోచ్‌లో ఈ ధరలు రూ.1,349 నుంచి రూ.2,699, వోల్వో సర్వీసుల్లో రూ.4,239 నుంచి రూ.4,799, అంతకంటే ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏసీ స్లీపర్‌ బస్సులో సీట్ల ధరలు రూ.3,899 నుంచి రూ.6,349 వరకు ఉన్నాయి. వోల్వో బస్సుల్లో టికెట్‌ ధరలు దూరాన్ని బట్టి రూ.7 వేల వరకు ఉండడం గమనార్హం. తిరుగు ప్రయాణంలోనూ 16నుంచి 20 తేదీ వరకు టికెట్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. నగరం నుంచి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కొత్తగూడెం వెళ్లే ప్రైవేట్‌ ట్రావెల్స్‌లోనూ టికెట్‌ రేట్లలో పెరుగుదల కనిపిస్తోంది.


city2.jpgమూలన పడిన వాహనాలూ..

డిమాండ్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మూలనపడ్డ, కాలం చెల్లిన, ఫిట్‌నెస్‌ లేని బస్సులకూ తూతూ మంత్రంగా మరమ్మతు చేసి కొందరు యజమానులు రోడ్లపైకి తీసుకువస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ ఉత్సవ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 07 , 2026 | 07:26 AM