Share News

మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:48 AM

మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఈమేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. సికింద్రాబాద్‌, మంచిర్యాల్‌, సిరిపూర్‌కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం నుంచి వరంగల్‌, కాజీపేటల వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు.

మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు

వరంగల్: ఈ నెల 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం(Medaram)లో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు దక్షిణమధ్య రైల్వే మేడారం జాతర ప్రత్యేక రైళ్లను ఈ నెల 28 నుంచి నడుపనుంది. రాష్ట్రంలోని సికింద్రాబాద్‌, మంచిర్యాల్‌, సిరిపూర్‌కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం ప్రాంతాల నుంచి మేడారం జాతర ప్రత్యేక రైళ్లు వరంగల్‌, కాజీపేటల వరకు నడుస్తాయని దక్షిణమధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి ఎ.శ్రీధర్‌ గురువారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు నడిచే మేడారం జాతర ప్రత్యేక రైళ్లు పూర్తిగా అన్‌ రిజర్వుడ్‌ జనసాధారణ రైళ్లని జాతర వెళ్లే భక్తులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని కోరారు. ఇవి ఆయా మార్గాల్లోని అన్ని స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.


సికింద్రాబాద్‌-మంచిర్యాల్‌-సికింద్రాబాద్‌

ఈనెల 28, 30, ఫిబ్రవరి 1 తేదీల్లో సికింద్రాబాద్‌ -మంచిర్యాల్‌- సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు కాజీపేట మీదుగా కాజీపేట మీదుగా నడుస్తాయి. సికింద్రాబాద్‌-మంచిర్యాల్‌ రైలు(07495) ఉదయం 5.45 గంటలకు సికిందరాబాద్‌లో బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 1.30 గంటలకు మంచిర్యాల్‌ చేరుకుంటుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మంచిర్యాల్‌-సికిందరాబాద్‌ రైలు (07496) మంచి ర్యాల్‌లో బయలుదేరి రాత్రి 8 గంటలకు కాజిపేటకు, రాత్రి 10.10 గంటలకు సికిందరాబాద్‌ చేరుకుంటుంది.


సికింద్రాబాద్‌-సిరిపూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌

ఈనెల 29, 31 తేదీల్లో సికింద్రారాబాద్‌-సిరిపూర్‌ కాగజ్‌ నగర్‌-సికింద్రాబాద్‌ మేడారం (07497/07498) ప్రత్యేక రైళ్లు నడుస్తాయి, ఈ తేదీలలో మేడారం జాతర ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి ఉదయం ఉదయం 5.45 గంటలకు బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 2 గంటలకు సిరిపూర్‌ కాగజ్‌నగర్‌ చేరుకుంటాయి. అదే రోజు మద్యాహ్నం 2.30 గంటలకు సిరిపూర్‌ కాగజ్‌నగర్‌లో బయలుదేరి రాత్రి 7.45 గంటలకు కాజిపేటకు, రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటాయి.


meda2.2.jpg

నిజామాబాద్‌-వరంగల్‌-నిజామాబాద్‌

నిజామాబాద్‌-వరంగల్‌-నిజామాబాద్‌ మేడారం జాతర ప్రత్యేక రైళ్లు (07498/07499) ఈ నెల 28 నుంచి 31 వరకు రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లు నిజామాబాద్‌లో ఉదయం 7.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌ చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు వరంగల్‌లో బయలుదేరి అదే రాత్రి 10.30 గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటాయి.


ఖమ్మం-కాజీపేట-ఖమ్మం

ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఖమ్మం-కాజీపేట-ఖమ్మం మేడారం ప్రత్యేక రైళ్లు (07503/07504) ఉదయం 10 గంటలకు ఖమ్మంలో బయలుదేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కాజీపేట చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కాజీపేటలో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం చేరుకుంటాయి.


ఆదిలాబాద్‌-కాజీపేట-ఆదిలాబాద్‌

ఆదిలాబాద్‌-కాజీపేట (07501)మేడారం జాతర ప్రత్యేక రైలు ఈ నెల 28న రాత్రి 11.30 గంటలకు ఆదిలాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు (29 తేదీ) ఉదయం 11.45 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. అలాగే కాజిపేట-ఆదిలాబాద్‌ (07502)మేడారం ప్రత్యేక రైలు ఈ నెల 29వ తేది మధ్యాహ్నం 1.15 గంటలకు కాజీపేటలో బయలుదేరి మరుసటి రోజు (30వ తేదీ) తెల్లవారు జామున 4 గంటలకు ఆదిలాబాద్‌ చేరుకుంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి.

హమ్మయ్య! పసిడి, వెండి ధరలు తగ్గాయోచ్!

వైసీపీది భూ భక్ష పథకం

Read Latest Telangana News and National News

Updated Date - Jan 23 , 2026 | 11:54 AM