Bigg Boss House: బిగ్ బాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:24 AM
కన్నడ బిగ్ బాస్ హౌస్‌ని సీజ్ చేశారు పోలీసు అధికారులు. బిగ్ బాస్ హౌస్ నిర్వహణకు సరైన అనుమతులు లేవంటూ నోటీసులు జారీ చేశారు.
బెంగళూరు: కన్నడ బిగ్ బాస్ హౌస్‌ని సీజ్(Kannada Bigg Boss House Seized) చేశారు పోలీసు అధికారులు. బిగ్ బాస్ హౌస్ నిర్వహణకు సరైన అనుమతులు లేవంటూ నోటీసులు జారీ చేశారు. అయితే, పోలీసుల నోటీసులకు బిగ్ బాస్ సీజన్ 12 నిర్వాహకులు స్పందించలేదు.
ఈ నోటీసులకు స్పందించకపోవడంతో బిగ్‌బాస్ హౌస్‌ని సీజ్ చేశారు. హౌస్ సీజ్ చేయడంతో కంటెస్టెంట్లను థియోటర్‌కి బిగ్‌బాస్ నిర్వాహకులు తరలించారు. పర్యావరణ అనుమతులు లేవంటూ కన్నడ బిగ్ బాస్ హౌస్‌కి రెండు సార్లు నోటీసులు జారీచేశామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News