PMO Fake Officer Case: పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
ABN , Publish Date - Oct 07 , 2025 | 03:26 PM
ప్రధానమంత్రి కార్యాలయ అధికారిగా నటించి రామారావు అనే వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. మోసాలు చేస్తున్న రామారావుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో రామారావుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి కార్యాలయ (Prime Minister Office) అధికారిగా నటించి రామారావు (Rama Rao) అనే వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. మోసాలు చేస్తున్న రామారావుపై సీబీఐ (CBI) అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో రామారావుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. పీఎంఓలో సీనియర్ అధికారిగా నటిస్తూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
టీటీడీలో సుప్రభాత దర్శనం కోసం సిఫార్సు లేఖ రాశాడు రామారావు. కర్ణాటకలోని రెవెన్యూ అధికారులకు కూడా లేఖ రాసి భూముల రికార్డులు కావాలని కోరాడు రామారావు. అలాగే, ప్రముఖ యూనివర్సిటీకి లేఖ రాసి అడ్మిషన్ కావాలని సిఫార్సు చేశాడు రామారావు. ఈ క్రమంలో పీఎంఓ కార్యాలయాన్ని సంప్రదించారు టీటీడీ అధికారులు. రామారావు పేరుతో డిప్యూటీ సెక్రటరీ ఎవరూ లేరని పీఎంవో స్పష్టం చేసింది. పీఎంవో అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ అధికారులు రామారావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ ధోకా కార్డుపై బీఆర్ఎస్ నేతల రియాక్షన్
కొమరం భీం పోరాటం.. ఆత్మగౌరవం కోసమే: మంత్రి సీతక్క
Read Latest Telangana News And Telugu News