Share News

Naveen Yadav On Jubilee Hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

ABN , Publish Date - Oct 07 , 2025 | 03:54 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కి లైన్ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులతో ఈ రోజు(మంగళవారం) జూమ్ మీటింగ్‌ నిర్వహించారు.

Naveen Yadav On Jubilee Hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Naveen Yadav On Jubilee Hills Election

హైదరాబాద్‌, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bye Election)లో కాంగ్రెస్ (Congress) అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ (Naveen Yadav)కి లైన్ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులతో ఈ రోజు(మంగళవారం) జూమ్ మీటింగ్‌ నిర్వహించారు.


ఈ సమావేశంలో నవీన్ యాదవ్‌ వైపు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు బొంతు రామ్మోహన్ (Bontu Ram mohan). జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని బొంతు రామ్మోహన్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తాను పనిచేస్తానని ప్రకటించారు బొంతు రామ్మోహన్.


మరోవైపు.. జూమ్‌ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీలు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చేసిన సర్వే రిపోర్టులు , అభ్యర్థుల సామాజిక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే, రెండు పేర్లతో ఏఐసీసీకి సిఫారసు చేయాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

కొమరం భీం పోరాటం.. ఆత్మగౌరవం కోసమే: మంత్రి సీతక్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2025 | 04:31 PM