Cyber Fraud in Sangareddy: తెలంగాణలో భారీ సైబర్ మోసం.. ఐటీ ఉద్యోగినికి కుచ్చుటోపీ
ABN , Publish Date - Oct 08 , 2025 | 08:33 AM
సైబర్ నేరగాళ్లు చేసే మోసాలపై పోలీసులు, ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్న పలువురు బాధితులు మోసపోతునే ఉన్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఐటీ ఉద్యోగినిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు.
సంగారెడ్డి జిల్లా, అక్టోబర్8 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లు చేసే మోసాల (Cyber Fraud)పై పోలీసులు, ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్న పలువురు బాధితులు మోసపోతునే ఉన్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఐటీ ఉద్యోగిని (IT Employee)ని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. పలు దఫాలుగా మొత్తం రూ.54 లక్షలను కాజేశారు కేటుగాళ్లు. పటాన్ చెరులో ఉండే ఐటీ ఉద్యోగికి గత నెల 15వ తేదీన టెలిగ్రామ్‌లో మెసేజ్ పంపించారు సైబర్ నేరగాళ్లు.
బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమీషన్ ఇస్తామని మొదట రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే.. ఆ తర్వాత రూ.12 వేలు పంపించారు సైబర్ నేరస్థులు. ఇది నిజమేనని నమ్మి మొత్తం రూ.54 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఐటీ ఉద్యోగిని మోసపోయింది. ఈ విషయంపై పటాన్ చెరు పోలీసులకు బాధిత ఐటీ ఉద్యోగి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పటాన్ చెరు పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
Read Latest Telangana News And Telugu News