Share News

మున్సిపల్ చైర్ పర్సన్ ఎంపిక.. జీవన్ రెడ్డి అసంతృప్తి..

ABN , Publish Date - Feb 16 , 2026 | 06:43 PM

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. తన ప్రతిపాదనను కాదని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన కలత చెందారు..

మున్సిపల్ చైర్ పర్సన్ ఎంపిక.. జీవన్ రెడ్డి అసంతృప్తి..
Jagityal chairman dispute

కరీంనగర్, ఫిబ్రవరి 16: జగిత్యాల మున్సిపల్ చైర్‌ పర్సన్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. తన ప్రతిపాదనను కాదని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన కలత చెందారు. తన వర్గానికి చెందిన వ్యక్తికి కాకుండా.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి చెందిన సమిండ్ల వాణిని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎంపిక చేయడాన్ని ఆయన అవమానంగా భావిస్తున్నారు. సోమవారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..


‘నా గురించి, పార్టీతో నాకు ఉన్న అనుబంధం గురించి మీకు తెలుసు. పార్టీలో కొనసాగాలనే విషయంపై ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఎవరో వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మా హక్కులను కాలరాస్తున్నారు. మా కాంగ్రెస్ కార్యకర్తల హక్కులను కాపాడలేకపోతున్నా. ఈ క్షోభ ముగింపు కాదు. ఈ వేధింపులు భరిస్తూ పార్టీలో కొనసాగగలుగుతామా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంత కాలం భరించగలుగుతాను? దీనికి పరిష్కారం ఏంటి? అని కూడా ఊహించలేకపోతున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

ఉన్నావో కస్టడీ మరణం కేసు.. కుల్దీప్ సెంగార్ పిటిషన్‌పై 19న ఢిల్లీ కోర్టు విచారణ

భారతీయులకంటే ఎక్కువ మద్యం తాగినా.. ఐరోపా వారు సేఫ్! ఎందుకంటే..

Updated Date - Feb 16 , 2026 | 07:39 PM