Share News

ఇంద్రేశం మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:32 PM

సంగారెడ్డి జిల్లాలో ఉత్కంఠకు తెరపడింది. నిన్నటి వరకు నెలకొన్న రాజకీయ అనిశ్చితిని ఛేదిస్తూ ఇంద్రేశం మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ విజయంతో జిల్లాలో గులాబీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి.

ఇంద్రేశం మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం
Indresham municipality of Sangareddy district

సంగారెడ్డి, ఫిబ్రవరి 17: సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు శుభం కార్డు పడింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను బీఆర్ఎస్ (BRS) కైవసం చేసుకుంది. కోరం లేక వాయిదా పడిన ఎన్నిక ప్రక్రియ నేడు ప్రశాంతంగా ముగిసింది.

రెండో రోజు ముగిసిన ఎన్నిక ప్రక్రియ

నిన్న జరిగిన సమావేశంలో కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. నిన్న కేవలం ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నేడు మిగిలిన 12 మంది కౌన్సిలర్లు సభకు హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు 10 మంది, బీజేపీ కౌన్సిలర్లు ఇద్దరు ఉన్నారు.

చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక

బలాబలాల ఆధారంగా బీఆర్ఎస్ అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రమీల ఎన్నికయ్యారు. 12వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల హరీష్ రెడ్డి వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.


బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడంతో ఇంద్రేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. కౌన్సిలర్ల ఐక్యత వల్లే ఈ విజయం సాధ్యమైందని పార్టీ ముఖ్య నేతలు పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ తాజా చిత్రం విషయానికొస్తే, బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 06, బీజేపీ 02.. మొత్తం 18 మంది సభ్యులు


ఈ వార్తలు కూడా చదవండి:

నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!

ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 17 , 2026 | 01:58 PM